ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఎవరు జారిపోతారేమో నని బాబు ఆందోళన చెందుతున్నాడు. ఇప్పటికే కడపలో ఉన్న ఏకైక టీడీపీ ఎమ్మెల్యే వైస్సార్సీపీ లోకి వెళ్లి పోయాడు. అయితే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కూడా టీడీపీ కి రాజీనామా చేసి వైస్సార్సీపీ లోకి చేరిపోయాడు. లోటస్ పాండ్ లోని జగన్  నివాసం లో ఆమంచి భేటీ అయ్యాడు. మీడియా తో మాట్లాడుతూ చంద్ర బాబు పద్ధతి నచ్చకే పార్టీ మారుతున్నానని చెప్పాడు. అయితే విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.


ఎన్నికల ముందు వలసలు చంద్ర బాబు కు కునుకు లేకుండా చేస్తున్నాయే ...!

టీడీపీకి రాజీనామా చేసి  వైసీపీలోనే ఆయన చేరనున్నారన్న దిశగా వెలువడుతున్న వార్తలు చంద్రబాబుకు బీపీని పెంచేస్తున్నాయని చెప్పాలి.  ఒక ఢిల్లీ దీక్షతో తనకు తానే హీరో అయిపోయాననుకుంటున్న బాబుకు ఈ పరిణామాలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. టీడీపికి ప్లస్ గా భావిస్తున్న వాళ్లుఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడితే... వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడమెలా?  ఎలాగోలా పోటీ చేసిన విజయం సాధించేదెలా? అన్న దిశగా చంద్రబాబు తల పట్టుకోక తప్పదన్న విశ్లేషణలు సాగుతున్నాయి. 


అయినా అవంతి టీడీపీని వీడే ఆలోచన చేయడానికి గల కారణాలు ఏమిటన్న విషయానికి వస్తే... గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అవంతి... ప్రస్తుతం మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గం నుంచి ఓ దఫా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గడచిన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నేతలంతా అటు టీడీపీలోనో ఇటు వైసీపీలోనో చేరిపోయారు. గంటాకు ముఖ్య అనుచరుడిగా ముద్రపడ్డ అవంతి... గంటాతో పాటు టీడీపీలో చేరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: