తెలుగుదేశం పార్టీకి ఇప్పటి వరకూ ఓ గర్వం ఉండేది. ఆ పార్టీ అధినేత గండర గండడు. రాజకీయంగా సీనియర్ మోస్ట్ నేత. అపర చాణక్యుడు. వ్యూహాలు అమలు చేయడంతో దిట్ట. అటువంటి నేత ఉన్న పార్టీ తమదని పసుపు శిబిరం ఎపుడూ మురిసిపోతూ వచ్చేది.


బాబు కంట్రోల్లో లేదా :


ఇది చాల‌కాలంగా విన వస్తున్న ఆరోపణ మాత్రమే. టీడీపీలో మునుపటి విధంగా అధినేత చంద్రబాబు వ్యవహించలేకపోతున్నారని అంతా అనుకోవడం జరుగుతూ వచ్చేది. అయితే ఇపుడు అదే పార్టీలో నాలుగున్నరేళ్ళు ఉండి బయటకు వచ్చిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణ మోహన్ చేసిన ఆరోపణలు చూస్తే గతంలో వచ్చిన ప్రచారం నిజమేనా అన్న సందేహాలు ఏర్పడుతున్నాయి. నిన్న కాక మొన్న ప్రధాని స్థాయిలో  ఉన్న మోదీ గుంటూరు వచ్చి చంద్రబాబు ని పక్కన పెట్టి ఆయన కుమారుడు లోకేష్ మీద ఆరోపణలు చేశారు. అంటే టీడీపీకి అధినేత, ముఖ్యమంత్రి గా బాబు ఉన్నా ఆయన కాకుండా నిర్ణయాలు తీసుకునే వారు ఉన్నారా. పార్టీ, ప్రభుత్వంలో బాబు పట్టు తగ్గిపోతోందా అన్న డౌట్లు పుట్టుకువస్తున్నాయి.


బయట శక్తుల ప్రమేయం :


నిజానికి ఓ ప్రభుత్వంలో బయట శక్తుల ప్రమేయం ఎందుకు ఉంటుంది. ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉంటారు. ఏ విషయమైనా వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఆమంచి క్రిష్ణ మోహన్ చేసిన విమర్శలు చూస్తూంటే బయట శక్తులు వచ్చి పెత్తనం చేస్తున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్మెంట్ కష్టమైపోతోందని అంటున్నారు. అలాగే ఓ బలమైన సామాజిక వర్గం పడగ నీడ కూడా అధికార పార్ర్టీపైనా, ప్రభుత్వంపైనా ఉందన్నది ఆయన ఆరోపణ. నిజానికి ఈ విషయాలు కొంత చూచాయగా జానానికి తెలిసినా ఇపుడు వాటిని అధికారికం చేస్తూ ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే చెబుతున్న మాటలు చూస్తూంటే నమ్మేలాగానే ఉన్నాయి. మరి జనం ఇవే నిజమని గట్టిగా విశ్వసిస్తే మాత్రం టీడీపీకి రేపటి ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవు.


మరింత సమాచారం తెలుసుకోండి: