ఎన్నికల వేళ టీడీపీకి వరస షాకులు తగులుతున్నాయి. పార్టీకి విశ్వాసంగా ఉన్న తమ్ముళ్ళు ఒక్కొక్కరుగా  గడప దాటేస్తున్నారు. నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణమొహన్ వైసీపీ తీర్ధం పుచ్చుకోగా, నేడు విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు టీడీపీకి బై చెప్పి జగన్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. ఇదే బాటలో మరికొందరు ఉన్నట్లుగా తెలుస్తోంది.


అమలాపురం ఎంపీ అటే :


ఇక అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా టీడీపీపై అసంతృప్తితో ఉన్న ఆయన ఇక పార్టీకి గుడ్ బై చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కోనసీమకు రైలును తీసుకువచ్చే విషయంపై కేంద్రంతో అలుపెరగని పోరాటం చేస్తున్నారు ఎంపీ పండుల రవీంద్రబాబు. అయితే అందుకు టీడీపీ అధినాయకత్వం సహకరించడం లేదని ఆయన సన్నిహితులవద్ద వాపోయినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. 


బిగ్ వికెట్లు రెడీ :


ఈ వూపు ఇక్కడితో ఆగదని అంటున్నారు. టీడీపీలోని పెద్ద తలకాయలు, మంత్రుల స్థాయి నాయకులు సైతం ఇపుడు వైసీపీతో చర్చలు జరుపుతున్నారట. అతి తొందరలో టీడీపీకి భారీ షాకులు ఇచ్చేందుకు పలువురు క్యూ కడుతున్నారని భోగట్టా. అదే జరిగితే టీడీపీకి ఎన్నికల కంటే ముందే కష్టాలు మొదలైనట్లే.



మరింత సమాచారం తెలుసుకోండి: