ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఎవరు జారిపోతారేమో నని బాబు ఆందోళన చెందుతున్నాడు. ఇప్పటికే కడపలో ఉన్న ఏకైక టీడీపీ ఎమ్మెల్యే వైస్సార్సీపీ లోకి వెళ్లి పోయాడు. అయితే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కూడా టీడీపీ కి రాజీనామా చేసి వైస్సార్సీపీ లోకి చేరిపోయాడు. లోటస్ పాండ్ లోని జగన్  నివాసం లో ఆమంచి భేటీ అయ్యాడు. మీడియా తో మాట్లాడుతూ చంద్ర బాబు పద్ధతి నచ్చకే పార్టీ మారుతున్నానని చెప్పాడు. 


చంద్ర బాబు కు షాక్ లు మీద షాక్ లు ... రాజీనామా యోచన లో మరో ఎంపీ ...!

ఇక ఈ జాబితాలో తదుపరి పేర్లు ఏవి? అనేది ఆసక్తిదాయకమైన అంశం. ఇప్పటి వరకూ ముగ్గురు సిట్టింగులు టీడీపీని వీడారు. రావెల కిషోర్ బాబు జనసేనలోకి చేరిపోయారు. మేడా మల్లిఖార్జున రెడ్డి, ఆమంచిలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్టే. ఇక తదుపరి ఎవరు? అంటే.. ఎంపీ అవంతి శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల కూడా చంద్రబాబుతో జరిగిన సమావేశంలో తనకు ఎమ్మెల్యే టికెట్ కావాలని అవంతి కోరినట్టుగా తెలుస్తోంది. అయితే ఎంపీగా గెలిస్తే.. పార్లమెంటరీ పార్టీ నాయకుడి పదవిని ఆఫర్ చేశారట చంద్రబాబు. అదంతా సరదాగా జరిగిన సంభాషణే.

Image result for chandrababu naidu

ఇక తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయబోవచ్చు అనే ఊహాగానంలో ఉన్న మరో పేరు తోట త్రిమూర్తులు. ఈ ఎమ్మెల్యే కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూట్లో ఉన్నారని సమాచారం. గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్లు కూడా ఈ ప్రయత్నంలో ఉన్నారని.. అయితే గంటాను భరించేందుకు ఏ పార్టీ కూడా రెడీగా లేదనే టాక్ వినిపిస్తోంది. మరికొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా పక్కచూపులు చూస్తున్నారని.. కొన్ని అనూహ్యమైన పేర్లు కూడా ఈ జాబితాలో ఉండబోవచ్చనే మాట వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: