టీడీపీకి చేటు కాలం దాపురించిందా..సరిగ్గా ఎన్నికల ముందు పార్టీకి ఎందుకిలా జరుగుతోంది, ఓ వైపు మళ్ళీ గెలవాలని అన్నీ రెడీ చేసుకుంటున్న చంద్రబాబుకు వరసగా షాకులు తగులుతున్నాయి. ఇంతకాలం సాగింది ఒక ఎత్తు అయితే ఇపుడు మరో ఎత్తుగా ఏపీ రాజకీయాలు సాగుతున్నాయి.


ఏపీలో అవినీతి తారస్థాయి :


ఏపీలో అవినీతి తారస్థాయిలో ఉందని నిన్నటి వరకూ ఆ పార్టీలో ఉండి ఈ రోజే బయటకు వచ్చి వైసీపీ తీర్ధం పుచ్చుకున్న అవంతీ శ్రీనివాసరావు కుండబద్దలు కొట్టారు. ఏపీలో విచ్చలవిడిగా సాగుతున్న అవినీతిని చూసే ప్రధాని మోడీ బాబుకు రెడ్ సిగ్నల్ చూపించారని  అవంతీ పక్కాగా చెప్పేశారు. ఓ టీడీపీ ఎమ్మెల్యే విషయంలో జరిగిన అవినీతి భాగోతం ఏకంగా ప్రధాని ఆఫీస్  కి చేరిందని, ఆ మీదటనే ఏపీలో జరుగుతున్న అవినీతిపై ప్రధాని ప్తత్యేక ద్రుష్టి సారించారని అవంతి చెప్పుకొచ్చారు. బాబు ఏపీ ప్రయోజల కోసం మోడీతో పోరాడడం లేదని, సొంత ప్రయోజనాల కోసమే ఆరాటపడుతున్నారని ఆయన అన్నారు.


బాబు వల్లే హోదా రాలేదు :


ఇక అవంతీ మరో ఘాట్ కామెంట్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా బాబు వల్లనే రాలేదని చెప్పారు. ఒక రోజు హోదా వద్దని, మరో రోజు కావాలని బాబు తన ఇష్టం వచ్చినట్లుగా యూ టర్నులు తీసుకుని జనాన్ని పూర్తిగా అయోమయంలో పడవేశారని అన్నారు. గత అయిదేళ్ళలో  ఏపీకి సరైన అభివ్రుధ్ధి జరగలేదని, ప్రజలకు టీడీపీ ఏ విధంగానూ న్యాయం చేయలేకపోయిందని అవంతి ద్వజమెత్తారు. తాను రైల్వే జోన్ కోసం ధర్నా చేసే మందలించిన తీరు చంద్రబాబుదని ఆయన అన్నారు. మొత్తానికి బాబుని ఈ ఎంపీ గట్టిగానే అటాక్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: