ఏపీలో టీడీపీ పటిష్టమైన పార్టీ. దాని అధినాయకుడు చంద్రబాబు తిమ్మిని బమ్మి చేయగల సమర్ధుడు, ఓ వైపు ప్రాణాలకు తెగించి జగన్ పాదయాత్ర చేసినా, జనంలో జగన్ కి విపరీతమైన ఆదరణ ఉన్నా  ఇంకా జనంతో పాటు, పార్టీ తమ్ముళ్లకు కూడా అదే నమ్మకం.  బాబే గెలుస్తారు, గెలిపిస్తారని....


మబ్బులు తొలగిపోతున్నాయా :


టీడీపీ నే చూపిస్తూ ఏపీలో మీడియా ఇన్నాళ్ళు చేసిన మాయాజాలం మబ్బులు ఒక్కోటీ విడిపోతున్నాయా. చూడబోతే అలాగే ఉంది పరిస్థితి. లేకపోతే బాబు మీద ఇంతవరకూ ఎవరూ అనని మాటలు వినని మాటలు ఆయన పక్కనే ఉండి వచ్చిన వారంతా చేయడమేంటి. ఇద్దరే అట్నుంచి ఇటు వచ్చారు, కానీ అధినేత చంద్రబాబుని నిద్రపట్టనీయకుండా చేస్తున్నారు. టీడీపీని, చంద్రబాబుని డ్యామేజ్ చేసేలా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అవినీతి బంధుప్రీతి అంటూ పదునైన విమర్శలే ఎక్కుపెడుతున్నారు.


అచ్చం లోకేష్ బాబు లాగానే :


అప్పట్లో టీడీపీ భాని నాయకుడు లోకేష్ ఓ మీటింగులో అన్నారు అవినీతి, బంధుప్రీతి కలబోసిన పార్టీ ఏదినా ఉందంటే అది టీడీపీయేనని. టంగు స్లిప్ అయి లోకేష్ అలా అన్నారని అనుకున్నారంతా. ఇపుడు ఎమ్మెల్యే ఆమంచి, ఎంపీ అవంతి శ్రీనివసరావు చెబుతున్న దాని బట్టి చూస్తూంటే ఆ రెండూ టీడీపీ బ్రాండ్ అన్నట్లుగానే ఉంది. ఆమంచి క్రిష్ణ మోహన్ మాట్లాడుతూ టీడీపీకి ఉన్న కుల పిచ్చిని ఉతికి ఆరేశారు. ఏకంగా ఐఏఎస్. ఐపీఎస్ క్యాడర్లో నూ కులం రంగులు చూసే గుణం చంద్రబాబుదని ఘాటుగానే విమర్శించారు. తన చుట్టు కీలకమైన అధికారులను చంద్రబాబు తన వారినే పెట్టుకోవడం వెనక ఆంతర్యం ఏంటని ఆయన నిగ్గదీశారు. కులం కోసమే బాబు పనిచేస్తున్నారని నిందించారు. 


అన్నీ అవినీతి కధలే :


ఇక మరో ఎంపీ అవంతి శ్రీనివాస్ బాబు జమానాలో జరిగిన అవినీతి టాప్ గేర్లో ఉందని గుట్టు విప్పేశారు. ఏపీకి ఎంత ఇచ్చిన అవినీతే జరుగుతోందని ఏకంగా పీఎం ఆఫీస్ లోనే అంటున్నారని అవంతి అసలు సంగతి బయట పెట్టారు. చంద్రబాబు సర్కార్ పూర్తిగా అవినీతిలో మునిగి తేలుతోందని ఆయన అన్నారు. పాలన గాడి తప్పిందని, అవినీతిలో ఏపీ నంబర్ వన్ గా ఉందని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో అవినీతి, అయోమయం పాలన సాగుతోందని, జనం విసిగిపోయారని ఆయన అనడం ద్వారా ఆ పార్టీ కూసాలు కదిలించేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: