ఆంధ్ర రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. అధికార పార్టీ నుంచి వలసలు వైసీపీ లోకి రోజురోజుకు పెరిగి పోతున్నాయి. ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు , ఒక ఎంపీ వైస్సార్సీపీ ఖండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇంతటి తో ఈ వలసలు ఆగేటట్లు కనిపించే టట్లు లేదు. ఉత్తరాంధ్రకు చెందిన మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా వైసీపీలోకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఇప్పటికే ఈ విషయం పసిగట్టిన చంద్రబాబు వారితో మాట్లాడించే ఏర్పాటు చేయాలని ఆ జిల్లాలకు చెందిన మంత్రులకు చెప్పినా సదరు ఎమ్మెల్యేలు మాత్రం చంద్రబాబుతో మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదని సమాచారం.

Image result for chandra babu

చంద్రబాబు సైతం స్వయంగా అవంతి శ్రీనివాస్‌తో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ఫోన్లో అందుబాటులోకి రాలేదని చెబుతున్నారు.అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడడానికి ప్రధాన కారణం మంత్రి గంటాతో తలెత్తిన విభేదాలే కారణమని విశాఖ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. 2009లో భీమిలి నుంచి గెలిచిన అవంతి 2014లో పార్టీ సూచన మేరకు అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు.

Image result for chandra babu and jagan

అయితే... అవంతి వ్యాపారాలు, విద్యాసంస్థల్లో అధిక భాగం భీమిలి ప్రాంతంలోనే ఉన్నాయి.కానీ,.. అక్కడి నుంచి ఆయన ప్రాతినిధ్యం లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు తలెత్తాయట. ఈ పరిస్థితుల్లో ఈసారి తనకు భీమిలి ఎమ్మెల్యే టికెట్ కావాలని అవంతి కోరినా చంద్రబాబు ఆమోదం తెలపకపోవడంతో ఆయన వైసీపీకి జంప్ చేసినట్లు చెబుతున్నారు.అయితే... ఉత్తరాంధ్రలో టీడీపీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోన్న మిగతా ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరనేది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: