జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి లక్ష్యం ఏంటి? ఎలాంటి కవ్వింపులూ లేకుండానే ఈ దాడులకు పాల్పడ్డం వెనుక కారణమేంటి? రాబోయే ఎన్నికలా..? లేకుంటే రాష్ట్రంలో అలజడి సృష్టించడమా..? సర్జికల్ స్ట్రైక్స్ కు ప్రతీకారమా..? రాజకీయ కారణాల వల్లే ఇంత భారీ ఎటాక్ జరిగిందా? ఇంతపెద్ద ఎత్తున వ్యూహరచన చేసినా నిఘావర్గాలు ఎందుకు పసిగట్టలేకపోయాయి.?

Image result for pulwama attack

వాస్తవానికి ఈరోజు కశ్మీర్ లో జరిగే శాంతిభద్రతల పర్యవేక్షణ సదస్సుకు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరు కావాల్సి ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యంత్రాంగాన్ని సిద్ధం చేసేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. నిన్న సీఆర్పీఎఫ్ కాన్వాయ్ కూడా శాంతిభద్రతల పరిరక్షణకోసమే వెళ్తోంది. 70 బస్సుల్లో జవాన్లు వెళ్తున్న క్రమంలోనే దాడి జరిగింది. లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ను పర్యవేక్షిందుకు ఉద్దేశించిన సమావేశం ముందురోజే జరిగిన ఈ దాడి వెనుక వ్యూహమేంటనేది అంతుబట్టని విధంగా ఉంది.

Image result for rajnath singh

ఏప్రిల్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దేశం యావత్ దృష్టంతా వీటిపైనే ఉంది. ఐదేళ్లు అధికారంలో ఉన్న మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ తమ హయాంలో టెర్రరిస్టుల జాడే లేకుండా చేశామని చెప్పుకుంటోంది. గతంతో పోల్చితే ఉగ్రవాదుల దాడులు తగ్గాయని చెప్పుకుంటూ ఎన్నికల్లో దాన్నో అస్త్రంగా వాడుకోవాలని బీజేపీ భావించింది. స్వతంత్ర భారతంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా సర్జికల్ స్ట్రైక్స్ ను తమ విజయంగా చెప్పుకుంటోంది. ఇంతలో ఇంత భారీ దాడి జరగడంతో ఆ పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది.

Image result for modi on terrorism

భద్రతాధికారుల అంచనాను బట్టి చూస్తే ఈ దాడి కచ్చితంగా అలజడి సృష్టించడానికేనని అర్థమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దాడి చేయడం ద్వారా తమ ఉనికిని చాటుకోవడం ఫస్ట్ మోటివ్.! అలా చేయడం ద్వారా తమ హయాంలో టెర్రరిస్టులను అణిచేశాం అని చెప్పుకుంటున్న బీజేపీకి ఓ హెచ్చరిక పంపడం టెర్రిరిస్టుల లక్ష్యం.! ఒకవేళ అదే వారి లక్ష్యమైతే తాజా ఎటాక్ ద్వారా అది నెరవేరినట్లే! అలా కాకుండా ఎన్నికలను లక్ష్యంగా చేసుకున్నట్టయితే ఈ దాడి మొదటిదిగా భావించవచ్చు.. మున్ముందు మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉండొచ్చు. అందుకు తగ్గట్లు భద్రతాదళాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: