తీర ప్రాంత్ర రాష్ట్రమైన ఏపీకి తుపానులు కొత్త కాదు, భారీ తుపానులు అంతకంటే కొత్త కాదు, కానీ ప్రభంజనాలు మాత్రం చాలా అరుదు, రెండు దశాబ్దాలకు ఒకసారి ఆలంటివి వస్తూంటాయి. అలాంటివి వచ్చినపుడు ఇక చెప్పనక్కరలేదు భారీ వంశ వ్రుక్షాలు సైతం కొట్టుకుపోతాయి ఇది చరిత్ర చెప్పిన సత్యం..


జగన్నామస్మరణలో :


ఏపీలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. నిన్నటి వరకూ ఉన్న పరిస్థితి వేరు, నేడు వేరు. జగన్ అధికారంలోకి వచ్చేశారా అనేంతగా ఇపుడు వాతావరణం మారింది. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు. కానీ రాజకీయం అంతా ఒక్కటిగా కేంద్రీక్రుతమవుతోంది. రేపటి ఎన్నికలలో జరిగేదేంటో తెలుసు అన్నట్లుగా సంకేతాలు ముందే ఇచ్చేస్తున్నారు. ఏపీలో అధికార టీడీపీ చిత్తు అయిపోతున్న వేళ ప్రత్యామ్నాయంగా వైసీపీని ఎన్నుకుంటున్నారు. ప్రతీ రోజూ జగన్ చుట్టూ క్యూ కడుతున్న వారిని చూస్తే ఏపీలో బలమైన ప్రభజనం వీస్తోందా అని అనిపించకమానదు.


జగన్ వచ్చేస్తున్నాడు :


ఈ మాటలు అన్నది ఎవరో కాదు, టీడీపీ వ్యవస్థాకప సభ్యుల్లో ఒకరుగా ఉన్న దాసరి జై రమేష్  ఆయన టీడీపీకి ఇపుడు దూరంగా ఉంటున్నారు. ఎందుచేతనంటే  అన్న గారు పెట్టిన టీడీపీ ఇప్పటి టీడీపీ ఒక్కటి కాదని ఆయన భావిస్తున్నారు. కానీ ఇపుడు హఠాత్తుగా ఆయన రాజకీయల్లో చురుకుగా పాల్గొనాలని డిసైడ్ అయ్యారు. జగన్ని కలసి పార్టీలో చేరుతానని ప్రకటించారు. 2019లో ఏపీలో జగన్ ప్రభంజనాన్ని చూస్తున్నామని జై రమేష్ ప్రకటించారు. నిజానికి ఇది ఏపీ రాజకీయల్లో కీలకమైన పరిణామంగా చెప్పుకోవాలి. నిన్న ఆమంచి క్రిష్ణ మోహన్  చెప్పాడు జగన్ ఎంత భారీ మెజారిటీతో ఏపీలోని  సీట్లు కొల్లగొట్టబోతున్నాడో. ఇపుడు జై రమేష్ అదే మాట అన్నారు.


జాబితా పెద్దదే :


ఒక్క దాసరి జై రమేష్ మాత్రమే కాదు, ఎంతో మంది ఇపుడు టీడీపీని వీడి వైసీపీ వైపుగా వస్తున్నారు. రేపటి సీఎం జగన్ అన్నది ఒక్కటే  వాళ్ల మాటగా ఉంది. జగన్ ఒక్కరే ఏపీకి దిక్కు అంటున్న నాయకులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు.  ఒక్క మాటలో చెప్పాలంటే టీడీపీ నుంచి దూకేద్దామనుకుంటున్న వారంతా వైసీపీ టికెట్ దక్కితే చాలు అనుకుంటున్నారు. జగన్ని చులకనగా చూసిన ఏపీ అధికార పార్టీ పెద్దలకు పాలుపోని రీతిలో ఇపుడు రాష్ట్ర రాజకీయమంతా జగన్ చుట్టూ తిరుగుతోంది. ఇప్పటికే ఇలా ఉంది రేపు నోటిఫికేషన్ వస్తే అపుడు అధికార పార్టీకి మరిన్ని షాకులు తగలడం ఖాయమని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: