ఆలూ లేదు చూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్లుంది జనసేన పరిస్ధితి. పార్టీకి అధ్యక్షుడు పవన్ కల్యాణ్  తప్ప మరో దిక్కు లేదు. మొత్తం 13 జిల్లాల్లో తీసుకున్నా ఒక్క జిల్లాలో కూడా గట్టి నేతే కనిపించరు. పోనీ నియోజకవర్గాల్లో అయినా ఉన్నారా అంటే అదీ లేదు. జనసేన తరపున పోటీ చేయటానికి జనాల్లో విపరీతమైన పోటీ ఉందట. ఇప్పటి వరకూ అన్నీ నియోజకవర్గాలకు కలిపి సుమారుగా 4 వేల దరఖాస్తులొచ్చాయట. ఇంకా గడువుంది లేండి.

 Image result for pawan kalyan meetings

రాబోయే ఎన్నికల్లో జనసేన తరపున లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయటానికి ఆసక్తి ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని పవన్ పెద్ద పిలుపిచ్చారు లేండి. కామిడి ఏమిటంటే పవన్ కూడా ఓ దరఖాస్తు పెట్టుకున్నారు. అంటే ఎంపిగానా లేకపోతే ఎంఎల్ఏగానా అన్నది తెలీదు లేండి. అసలు ఏ నియోజకవర్గంలో పోటీ చేయటానికి దరఖాస్తు చేసుకున్నారో కూడా సీక్రెట్ గా ఉంచారు.

 Image result for pawan kalyan meetings

పోయిన ఎన్నికల్లో చంద్రబాబు, మోడితో కలసి పవన్ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు మూడున్నరేళ్ళు మిత్రపక్షంగానే ఉన్నారు. అధికార పార్టీకి మిత్రపక్షంగా ఉన్నందు వల్ల రాష్ట్రానికి జరిగిన ప్రయోజనమేంటి ? అన్నది అడక్కూడదు. అంటే ఒకరకంగా మిత్రపక్షంగా విఫలమయ్యారనే అనుకోవాలి. తర్వాత ఏదో విషయంలో ఇద్దరికీ చెడటంతో ప్రతిపక్షమయ్యారు.

 Image result for pawan kalyan meetings

అంటే చంద్రముఖి సినిమాలో హీరోయిన్ గంగ లాగ ఒక్కోసారి ఒక్కో విధంగా వ్యవహరిస్తుంటారు. ఒకసారి చంద్రబాబును తిడతారు. ఇంకోసారి చంద్రబాబుతో పాటు పుత్రరత్నం లోకేష్ పైన కూడా మండిపోతారు. మరోసారి జగన్ పై ఆరోపణలు చేస్తారు. దేశం మొత్తంమీద ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసుకోవటం బహుశా ఏపిలోనే చూడొచ్చేమో ? అంటే హోలు మొత్తం మీద జనసేన ఎవరికి మిత్రిపక్షమో, ఎవరికి ప్రతిపక్షమో జనాలకు కూడా అర్ధం కావటం లేదు.

 Image result for pawan kalyan meetings

ఈ పరిస్ధితుల్లో రాబోయే ఎన్నికల్లో పోటీ చేయటానికి ఉద్యోగాలకు పిలిచినట్లు దరఖాస్తులు పెట్టుకోమన్నారు. వచ్చిన దరఖాస్తుల్లో ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమలో అనంతపురం జిల్లాలోని నియోజకవర్గాలకు ఎక్కువ దరఖాస్తులొచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. పవన్ ఎక్కువగా ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో మాత్రమే దృష్టి పెట్టినట్లు మొదటి నుండి అనుకుంటున్నదే. ఇంతకీ విషయం ఏమిటంటే దరఖాస్తుల స్క్రీనింగ్ కమిటీలో వారికి ఒక్కళ్ళకు కూడా జనాలతో ఏమాత్రం సంబంధాలు లేవు. జనాలతో సంబంధాలు లేని వారు దరఖాస్తులను వడపోస్తారట. పవన్ యవ్వారం మొదటి నుండి ఇలాగే ఉంది. ఏం చేస్తాం


మరింత సమాచారం తెలుసుకోండి: