టాలీవుడ్ టాప్ హీరోల్లో బాలక్రిష్ణ ఒకరు. ఆయన వందకు పైగా సినిమాలు చేసి ఇప్పటికీ ఎక్కడా తగ్గడంలేదంటున్నారు. గత నెలలో కధానాయకుడుగా వచ్చిన బాలయ్య ఈ నెలలో మహా నాయకుడు అంటున్నారు. ఇక బోయపాటి మూవీ మార్చిలో ఉంది.మధ్యలో  అనిల్ రావిపూడి, వీవీ వినాయక్ మూవీస్ కూడా రెడీగా ఉన్నాయి. మరి బాలయ్య సైలెన్స్ గా ఉండడానికి కారణమేంటి..


కధానాయకుడు మూవీ మీద బాలయ్య చాలానే ఆశలు పెట్టుకున్నారు. ఆ మూవీ తనకు అచ్చొచ్చిన సంక్రాంతికి  రిలీజ్ చేశారు. బ్లాక్ బస్టర్ అయి వంద కోట్ల క్లబ్ లో చేరుస్తుందని కూడా భావించారు. మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన రిలీజ్ తరువాత డిజాస్టర్ గా మిగిలిపోయింది. దాంతో బాలయ్య చాలా డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళిపోయారా అంటున్నారు. రెండవ పార్ట్ మహా నాయకుడు కి ఉన్నంతలో రిపేర్లూ, రీ షూట్లు చేయించి ఈ నెల 22న విడుదల చేస్తున్నారు. కానీ ఎక్కడా చడీ చప్పుడూ ఈ మూవీ విషయంలో లేకపోవడం విశేషం.


మరీ ఇంతలా కూల్ గా మూవీ వస్తే జనం ఎలా రిసీవ్ చేసుకుంటారని బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు. కధాయకుడిని నమ్మి కోట్లు పెట్టిన వారికి నష్టపరిహారంగా ఈ మూవీని మంచి రాయితీతో బాలయ్య ఇచ్చారు. అంతవరకూ బాగానే ఉంది కానీ ఎటువంటి  ప్రీ ప్రమోషన్ లేకుండా ఈ మూవీకి రిలీజ్ చేస్తే తేడా కొడితే తమ గతెం కానని బయ్యర్లు వాపోతున్నారు. మరో వైపు లక్ష్మీస్  ఎంటీయార్ మూవీ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ టైంలో మహానాయకుడు గురించి ఏ మాత్రం ప్రచారం లేకుండా వదిలితే ఏమవుతుందోనన్న కంగారు పట్టుకుంది. బాలయ్యకి కధానాయకుడు రిజల్ట్ తరువాత ఈ బయోపిక్ పై  ఇంటెరెస్ట్ బాగా తగ్గిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగైతే మహానాయకుడు ని క్రిష్ డైరెక్షన్ మెరిట్స్ మాత్రమే కాపాడలిపుడు.


మరింత సమాచారం తెలుసుకోండి: