రాజకీయాల్లో ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ విధంగా అద్దాల మేడలో ఉన్నట్లే, ఒక రాయి వారు వేస్తే మరో నాలుగు రాళ్ళు వచ్చి పడతాయి. అపుడు అద్దాల మేడ‌కే ముప్పు వస్తుంది. మరి కొంతమంది మాత్రం హద్దులు దాటేసి ఏవేవో అనేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో  ఎవరూ సుద్ద పూసలు కాదు, ఆ సంగతి గుర్తు పెట్టుకోకపోతే అభాసుపాలు కావడం ఖాయం.


గంటా గుట్టు అలా :


నిజానికి విశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒకపుడు వ్యాపారం చేసుకునే వారు. ఆయన రాజకీయ ఎదుగుదలకు ఇప్పటి మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా ఓ కారణమంటారు. ఇక గంటా కూడా ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి అయ్యారు. తనకంటూ శిష్యగణాన్ని తయారు చేసుకున్నారు. అందులో కీకలమైన వారు ముత్తంశెట్టి అలియాస్ అవంతి శ్రీనివాసరావు, 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి భీమునిపట్నం ఎమ్మెల్యేగా అవంతి గెలిచారు. ఆ తరువాత గంటా గ్యాంగ్ లో కీలకంగా  ఉన్నారు. ఇద్దరి  మధ్యన భీమిలీ సీటు విషయంలోనే చెడింది.


అది మెల్లగా పెద్దదై ఇపుడు అవంతి ఏకంగా పార్టీ మార్చేసేంతవరకూ వచ్చింది. ఇక్కడో విషయం ఉంది. గంటా సంగతి అంతా అవంతికి తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు. నా జోలికి వస్తే చూసుకో, జాగ్రత్త అంటూ తాజాగే అవంతి గంటాకు చేసిన    హెచ్చరిక తో గంటా గురించిన సీక్రేట్లు ఏంటన్నది ఇపుడు అందరిలో ఆసక్తి బాగా పెరిగింది.


గంటా సైలెంట్ అవుతారా :


అసలు అవలేరు అని అంటున్నాయి రాజకీయ పరిణామాలు, రేపటి రోజున భీమిలీ నుంచి గంటా అవంతి ఢీ అంటే ఢీ కొట్టాల్సిన వారు. మరి అవంతిని విమర్శించకపోతే  గంటాకు గడవదు, పైగా టీడీపీ హై కమాండ్ ఆదేశాలు ఎటూ ఉంటాయి. మరి గంటాను తన పరిధిలో తాను ఉండమని అవంతి సున్నితంగా హెచ్చరిస్తున్నారు. లేకపోతే నీకే నష్టమంటున్నారు. మరి గంట ఆ పరిధి దాటి వస్తే జరిగే నష్టం ఏంటన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా  ఆసక్తి పెరిగిపోతోంది.


ఇది ఈ ఎన్నికల్లోపే బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అన్నట్లు గంటాకు సంబంధించి  ఓ అతి ముఖ్యమైన జీవితలక్ష్యం  అనబడే ఎత్తుగడను అవంతి అపుడే బయట పెట్టేశారు. గంటాకు ముఖ్యమంత్రి కావాలని ఉందట. దానికోసం ఆయన ఏమైనా చేస్తాడు జాగ్రత్త లోకేష్ అంటున్నారు అవంతి ఇదే నిజమైతే గంటా పెద్ద ప్లానో ఉన్నట్లే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: