వైసీపీ అధినేత జగన్ పేరు ఇపుడు ఏపీలో మారు మోగుతోంది. ఆయన వేస్తున్న అడుగులు ప్రత్యర్ధుల గుండెల్లో పిడుగులుగా మారుతున్నాయి. రామ నామంలా జగన్నామస్మరణతో టీడీపీ తరించిపోతోంది. ఏపీలో ఇపుడు జగన్ వేవ్ బాగా కమ్ముకుంది. ఆన్ని పార్టీల నుంచి ఈ వైపుగానే రాజకీయం దారులు తీస్తోంది పాలిటిక్స్.


జగన్ లండన్ టూర్ :


ఇటువంటి కీలకమైన టైంలో జగన్ లండం టూర్ పెట్టుకోవడం పట్ల సొంత పార్టీతో పాటు, రాజకీయ వర్గాల్లోనూ విస్మయం వ్యక్తం అవుతోంది. తెలిసిన సమాచారం ప్రకారం జగన్ ఈ నెల 20వ తేదీ నుంచి పది రోజుల పాటు లండన్ టూర్ చేస్తారని అంటున్నారు. ఈ మేరకు సీబీఐ కోర్టు కూడా జగన్ టూర్ కు పర్మిషన్  ఇచ్చేసింది. లండన్లో కుమార్తెను  చూసేందుకు జగన్ ఈ టూర్ పెట్టుకున్నారని సమాచారం. నిజానికి జనవరిలోనే ఈ టూర్ ఉండేది కానీ క్యాన్సిల్ అయింది. కానీ ఓ వైపు ఎన్నికలు ముంచుకొస్తున్న టైంలో జగన్  ఈ టూర్ పెట్టుకోవడంపై   అంతటా విస్మయం వ్యక్తం అవుతోంది.


వలసల సలసల :


ఏపీలో వైసీపీకి పాజిటివ్ బజ్ బాగా ఉంది. ఓ వైపు అధికార పార్టీ నుంచి వలసలు దారుణంగా వస్తున్నాయి. టీడీపీ బాగా డిఫెన్స్ లో  పడిపోయింది. మరిన్ని వలసలు కూడా ఉంటాయని అంతా అనుకుంటున్న టైం. అదే విధంగా టీడీపీ తొలి  జాబితాను కూడా విడుదల అవుతుందని, బాబు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని అనుకుంటున్నారు. మరి ఇంతటి కీలకమైన వేళ జగన్ పది రోజు పాటు ఏపీ రాజకీయ తెర మీద ఉండకపోతే ఎలా అంటున్నారు. టాప్ గేర్లో ఉన్న వైసీపీ రాజకీయాన్ని పరుగులు పెట్టించి ప్రత్యర్ధులను  ఉక్కిరి బిక్కిరి చేయాల్సిన వేళలో జగన్ లండన్ టూర్ పై భినాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


నిజానికి జగన్ తన కుమార్తె కోసం ఈ టూర్ పెట్టుకోవడం ఎవరూ కాదనరు, అయితే దాన్ని కూడా రాజకీయం చేసేందుకు రెడీ అవుతున్నారు ప్రత్యర్ధులు, ఎన్నికల్లో నిధుల సమీకరణ కోసమే జగన్ లండన్ టూర్ పెట్టుకున్నారని అపుడే విమర్శలు స్టార్ట్ చేసేశారు. మరి జగన్ చేతిలోనే నిర్ణయం ఉంది. ఆయన కనుక ఈ టైంలో ఉంటే ఏపీ రాజకీయం వేరు. క్షణ క్షణం మారుతున్న రాజకీయాన్ని  పూర్తి అనువుగా మార్చుకోవచ్చు. అధినేత పది రోజుల పాటు అందుబాటులో లేకుంటే ఆ చాన్స్ టీడీపీ తీసుకుని దూకుడు పెంచేస్తుదన్న ఆందోళన కూడా పార్టీ వర్గాలో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: