జగన్ బీసీ గర్జన సభకు బీసీ ల ప్రతి నిధి ఆర్ కృష్ణయ్య హాజరవ్వడం తో వైస్సార్సీపీ కి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. బీసీ లలో ఆర్ కృష్ణయ్య కు మంచి ఫాలోయింగ్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనితో బీసీ లు ఓట్లు వైస్సార్సీపీ కి ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ సభకు వివిధ ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అన్నింటికి మించి.. కృష్ణయ్య హాజరవ్వడంతో బీసీలంతా జగన్‌ వైపే ఉన్నారని ఆయన చెప్పకనే చెప్పారు. మొన్నటి వరకు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణయ్య.. ఇప్పుడు జగన్‌వైపు వచ్చేశారు. 

బీసీలకు జగన్ వరాల జల్లు ..!

బీసీ గర్జన మొదలైన దగ్గరనుంచి ఆద్యంతం ఉత్సాహంగా జరిగింది. జగన్‌ వచ్చే ముందు వరకు స్టేజ్‌పై ఉన్న నాయకులంతా చాలా ఉత్సాహంగా మాట్లాడారు. ఇక జగన్‌ వచ్చాక ప్రజల్లో ఫుల్‌ జోష్‌ వచ్చింది. అన్నింటికి మించి జగన్‌ వచ్చిన దగ్గరనుంచి అందరూ సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. జగన్‌ మాట్లాడుతున్నంత సేపు సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో.. ఆయన మధ్యమధ్యలో తన ప్రసంగానికి గ్యాప్‌ ఇవ్వాల్సి వచ్చింది.

Image result for r krishnaiah images

వాళ్లు నినాదాలు ఆపిన తర్వాతే తన ప్రసంగాన్ని కొనసాగించారు. బీసీ డిక్లరేషన్‌ గురించి చెప్తున్నంత సేపు జగన్‌ సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు.ఇక వైసీపీ అధినేత జగన్‌ కూడా జగన్‌ అనే నేను అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. బీసీలకు సంబంధించిన ప్రతీ హామీని ఇవ్వడానికి ముందు.. దేవుడు దయతలిస్తే.. మీరు గెలిపిస్తే అంటూ ప్రజల్ని ఉత్సాహపర్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. తాము ఏవేం చేయాలనుకుంటన్నామో చెప్పిన జగన్‌.. గతంలో బీసీలకు టీడీపీ ప్రభుత్వం ఏం చేయలేదని చాలా స్పష్టంగా అందరికి అర్థమయ్యేట్లు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: