ఎన్నికలు అంటేనే ఓ విధంగా జూదమే. ఏం జరుగుతుందో చివరి క్షణం వరకూ తెలియదు. కానీ కొన్ని సందర్భాల్లో సంకేతాలు కనిపిస్తూంటాయి.  దాన్ని బట్టి నేతలు, రాజకీయ పార్టీలు తన వ్యూహాలకు పదును పెడతాయి. జనం నాడి పట్టుకుంటూ తమదైన ఎత్తులను అమలుచేసుకుంటూ పోతాయి. మరి  ఏపీలో లేటెస్ట్ సీన్ ఏంటి...


వైసీపీలో కొత్త కళ :


నిన్న ఏలూరులో జరిగిన వైసీపీ బీసీ గర్జనను చూస్తే ఓ విషయం అర్ధమవుతోంది. ఆ సభ వైసీపీ విజయోత్సవ సభలా సాగిపోయింది. అక్కడ కూర్చున్న ప్రతి వైసీపీ నాయకుని ముఖంలో అధికార కళ వచ్చేసినట్లుగా అనిపించింది. ఇక జగన్ మాట్లాడింది. అక్షరాలా గంటన్నర. అంతసేపూ సభా ప్రాంగణం ఉర్రూతలూగిపోయింది. సీఎం జగన్ అంటూ నిన్నాదాలు ఓ రేంజిలో సాగాయి. జగన్ సైతం వాటిని అస్వాదిస్తూ తాను చెప్పదలచుకున్నది చెప్పారు. ఎక్కడా ఆయన డీవియేట్  కాకుండా బీసీల గురించి తమ పార్టీ ఏమనుకుంటోంది. ఏమి చేయబోతోంది చెప్పుకొచ్చారు. 


ఇక సభకు ఇసుక వేస్తే రాలంతగా జనం హాజరయ్యారు. బీసీ నేత ఆర్ క్రిష్ణయ్య ఈ మీటింగులు హాజరుకావడం బీసీల సభ సంపూర్ణంగా విజయవంతం అయిందని చెప్పడానికి నిదర్శనం. మొత్తానికి ఎన్నికల ముందు వైసీపీ నిర్వహించిన సభ అలనాటి అన్నగారి సిహ్మ గర్జన సభను గుర్తు చేసింది. 1994లో  అక్టోబర్ 10న  అన్న నందమూరి హైదరాబాదులో నిర్వహించిన భారీ సభ సూపర్ హిట్ అయింది. ఆ తరువాత రెండు నెలల్లో జరిగిన ఎన్నికల్లో ఆయన బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. అలాంటి మూడ్ నే ఈ బీసీ గర్జన కలుగచేసిందని చెప్పాలి.


అదే టైంలో అలా :


ఇక అదే టైంలో ఏపీ సర్కార్ చివరి ప్రయత్నాలు మొదలు పెట్టింది. రైతులకు కొంత మొత్తం వారి ఖాతాల్లో వేసేందుకు అప్పటికపుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనమే. ఏపీలో గాలి మారుతోందని గ్రహించినట్లుగా అఖరి అవకాశాలను అధికార పార్టీ వెతుక్కుంటోందనిపించెలా కొత్త జీవోలు వరసగా విడుదల అవుతున్నాయి. మరి ఇక్కడ ఇంత పెద్ద సభ వైసీపీలో ధీమా కలిగిస్తే అక్కడ అధికార పార్టీలో కంగారు పుట్టిందనుకోవాలి.  మరి ఈ ధీమా, ఆ కంగారు ఏది నిజం, ఏది అబద్దమో తేల్చేందుకు రెండు నెలలు ఆగితే చాలు. జనం చెప్పేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: