రాబోయే ఎన్నికల్లో పార్టీలోని ప్రత్యర్ధులను దెబ్బ కొట్టటానికి కర్నూలు ఫిరాయింపు ఎంఎల్ఏ ఎస్వీ మోహన్ రెడ్డి మాస్టర్ ప్లానే వేశారు. ప్రస్తుత పరిస్ధితుల ప్రకారమైతే వచ్చే ఎన్నికల్లో ఎస్వీకి టికెట్ వచ్చేది అనుమానమే. ఎందుకంటే, ఫిరాయింపు ఎంఎల్ఏ గెలవరంటూ చంద్రబాబు చేయించుకున్న సర్వే రిపోర్టుల్లో తేలింది. అయితే, ఎస్వీకే టికెట్ ఇవ్వాలంటూ నారా లోకేష్ పట్టుబడుతున్నారు.

 

ఇక ఎస్వీ గెలవరని సర్వేల్లో తేలగానే రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ పావులు కదపటం మొదలుపెట్టారు. తన కొడుకు టిజి భరత్ ను ఎంఎల్ఏగా పోటీ చేయించాటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. దాంతో భరత్ నియోజకవర్గంలో విస్తృతం పర్యటిస్తున్నారు. ఒకవైపు ఎస్వీ పర్యటిస్తుండగానో మరోవైపు భరత్ కూడా తిరుగుతుండటంతో నియోజకవర్గంలో గందరగోళం మొదలైంది. దానికితోడు భరత్ కూడా అంతర్గతంగా సర్వేలు చేయించుకున్నారు. తాను చేయించిన సర్వేల్లో ఎస్వీ అయితే ఓడిపోతారని తేలిందంటూ ప్రచారం మొదలుపెట్టారు. దోంతో ఎస్వీలో టెన్షన్ పెరిగిపోయింది.

 

అందుకు విరుగుడుగా తనకు టికెట్ దక్కకపోయినా పర్వాలేదుకానీ భరత్ కు మాత్రం రానీయకూడదని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా నారా లోకేష్ ను రంగంలోకి తెచ్చారు.  ఆదివారం లోకేష్ తో భేటీ అయిన ఎస్వీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీలో లోకేష్ పోటీ చేయాలని ప్రతిపాదించారు. లోకేషే బరిలోకి దిగుతే ఇక భరత్ కూడా తప్పుకోవాల్సిందే అన్నది ఎస్వీ ప్లాన్. అయితే ఎస్వీ ప్రతిపాదించారని లోకేష్ బరిలోకి దిగుతారా ? సేఫ్ నియోజకవర్గాలైన ఏ హిందుపురమో లేకపోతే కుప్పమో చూసుకుంటారు కానీ.


మరింత సమాచారం తెలుసుకోండి: