నారా లోకేష్ ఏం మాట్లాడిన కామెడీ అయిపోతుంది . అయితే కనీసం లోకేష్ అయినా మాట మాట్లాడేముందు గ్రహించాలి కదా నేను మాట్లాడే మాట చివరికి నవ్వుల పాలౌతుందని కానీ అలా గ్రహిస్తే లోకేష్ ఎందుకు అవుతాడు. తాజాగా లోకేష్ ఏకంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ మొత్తంగా మొత్తం 175 స్థానాల్లోనూ విజయం సాధింస్తామని లోకేశ్ చెప్పడం ఇప్పుడు కాస్తంత ఎబ్బెట్టుగానే అనిపించక మానదు.

Image result for lokesh

తన మాట తీరుతో ఇప్పటికే ఎప్పటికప్పుడు తన మీద తనే సెటైర్లే వేయించుకుంటున్న లోకేశ్... ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ మొత్తం అన్ని సీట్లలోనూ తమ పార్టీనే విజయం సాధిస్తుందని చెప్పడం చూస్తుంటే... తనను తాను ఆయన మరోమారు బుక్ చేసుకున్నట్లేనని చెప్పక తప్పదు. అయినాఈ దిశగా లోకేశ్ ఏమన్నారన్న విషయానికి వస్తే... *వచ్చే ఎన్నికల్లో టీడీపీ మరోసారి విజయభేరి మోగిస్తుంది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లు సొంతం చేసుకుంటాం.

Image result for lokesh

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం. కావున రాష్ట్ర ప్రజలంతా మావైపే ఉన్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో టీడీపీ మొత్తం స్తానాల్లో గెలుస్తుంది* అని లోకేశ్ వ్యాఖ్యానించారు. మొత్తంగా మొత్తం సీట్లు గెలిచేస్తున్నామని చెప్పిన లోకేష్ వ్యాఖ్యలకు వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి. వైసీపీ శ్రేణులేమో కానీ సోషల్ మీడియా మాత్రం బాగానే స్పందిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: