2014 లో జగన్ పార్టీ తరుపున గెలిచి అధికార పార్టీ తాయిలాలకు లొంగి పోయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఫిరాయిపు నేతలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. వీరి మీద ప్రజా వ్యతిరేకత ఏర్పడే సరికే చంద్ర బాబు టికెట్ ఇవ్వడానికి సుముఖత చూపించడం లేదు. దీనితో వారి పరిస్థితి ఘోరంగా తయారైంది. వీరిని పార్టీలోకి చేర్చుకునేటప్పుడేమో.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఖాయమని భరోసా ఇచ్చారట. అయితే.. ఇప్పుడు మాత్రం నో అని అంటున్నారట.

Image result for jagan

ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలది దిక్కుతోచని స్థితే అవుతోంది.ఇక ఇదే సమయంలో వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం. తాము తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని వారు అంటున్నారట.  ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు వారు వర్తమానాలు పంపుతున్నారని సమాచారం.అయితే..  వారిని తిరిగి చేర్చుకోవడానికి జగన్ మోహన్ రెడ్డి అంత ఆసక్తితో లేరని సమాచారం.

Image result for jagan

వారు  ఫిరాయించినప్పుడే వారిపై జగన్ దాదాపుగా నమ్మకం పోయింది.  ఇప్పుడు వాళ్లు వచ్చినా వారితో గతంలోలా ఉండటం కుదరదు అనేది జగన్ భావన. అందులోనూ తెలుగుదేశంలో టికెట్ దక్కే పరిస్థితి లేదని తెలిసి.. వారు ఇటు వస్తున్నారనే అంశంపై జగన్  కు స్పష్టత వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో.. వారిని తన వైపుకు రానీయకూడదని జగన్ నిర్ణయించారట. దీంతో.. ఫిరాయింపుదారుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా పడిందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: