ఏపీలో రాజకీయాలు వేగవంతంగా మారుతున్నాయి. మాస్టర్ మైండ్ చంద్రబాబు ఓ వైపు, దూకుడు రాజకీయ నేత జగన్ మరో వైపు మోహరించి ఉన్న ఏపీ చిత్రం ఎవరికీ తొందరగా అంతు చిక్కదు. ఏపీలో గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ అన్నవి సర్వేలు ఎప్పటికపుడు అందించినా కూడా రిజల్ట్ వచ్చే వరకూ అసలు కధ ఏంటో  ఎవరూ చెప్పలేరన్నది నిజం. ఇప్పుడైతే ఏపీలో వైసీపీ వేవ్ ఉన్నట్లుగా కనిపిస్తోంది.


సీమను కొడతారా  :


రాయలసీమ నాలుగు జిల్లాలు వైసీపీకి గట్టి పట్టు. అక్కడ మొత్తం 52 అసెంబ్లీ సీట్లు ఉంటే ఇందులో నుంచి 40 వరకూ గత ఎన్నికల్లో వైసీపీ గెలుచుకుని, అయితే అనంతపురంలో బొక్కా బోర్లా పడింది. ఈసారి అక్కడ రిపేర్లకు టీడీపీ యాక్షన్ ప్లాన్ మొదలైంది. చాలా కాలం క్రితమే సీమ జిల్లాలపై బాబు ద్రుష్టి పెట్టారు. కడపకు, పులువెందులకు క్రిష్ణా నీళ్లు అంటూ మొదలెట్టిన ప్రచారంతో పాటు, పెద్ద ఎత్తున ఫిరాయింపులు కూడా షురూ చేశారు. బలమైన వైసీపీ నేతలను ఈ వైపుగా లాగేసుకున్నారు.


ఇపుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ టైంలో మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశరెడ్డి కుటుంబాన్ని టీడీపీ వైపుగా తెచ్చేసుకుంటున్నారు. ఆయనతో పాటు పెద్ద వర్గమే టీడీపీలోకి రాబోతోంది. ఇక పాణ్యం ఎమ్మెల్యే గౌరు సుచరిత కుటుంబం కూడా టీడీపీలోకి వస్తుందని అంటున్నారు. ఇప్పటికే అక్కడ బలమైన భూమా కుటుంబం, ఎస్వీ కుటుంబం దూరమైంది. ఇవన్నీ చూస్తూంటే కర్నూల్, కడప సహా సీమ జిల్లాలో టీడీపీ బలపడే సూచనలు కనిపిస్తున్నాయి.


జగన్ మేలుకోవాల్సిందే ;


ఇపుడున్న పరిస్థితుల్లో జగన్ మేలుకోవాల్సిందేనని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీలో కీలక‌మైన నాయకులు బయటకు పోకుండా చూసుకోవడంతో పాటు, బయట నుంచి వచ్చే నాయకులతో మొదటి నుంచి ఉన్న నాయకులకు విభేదాలు లేకుండా సరి చేయాల్సిన బాధ్యత కూడా జగన్ దే. 2014 ఎన్నికల్లో వేవ్ ఉన్నట్లు కనిపించినా అండర్ కరెంట్ గా టీడీపీ చేసిన రాజకీయం, పొత్తులు ఎత్తులు చివరి నిముషంలో సీన్ మొత్తం మార్చేశాయి. 


ఇపుడు జగన్ సరైన వ్యూహాలు రూపొందించకపోతే మాత్రం మరో మారు బాబు చాణక్య‌ రాజకీయం ముందు దెబ్బ తినే పరిస్థితి ఉంది. మన ప్రజాస్వామ్యంలో అధి నాయకులను చూసి ఓట్లు వేసినా లోకల్  అభ్యర్ధులను, వారి బలాలను చూసి ఓట్లు పడే అవకాశాలే ఎక్కువ. అందువల్ల జగన్ తన ఇమేజ్ ని చూసి గెలుస్తామనుకోవడం పొరపాటే. లోకల్ లీడర్ షిప్ ని కూడా గట్టిగా ఉంచుకోగలిగితేనే విజయం దక్కుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: