అవును మీరు చదివింది నిజమే. అత్యాసకుపోయి, ప్రలోభాలకు గురైన కర్నూలు ఎంపి బుట్టా రేణుక చివరకు ప్రత్యక్ష రాజకీయాలకే దూరం కావాల్సొచ్చింది. కాంగ్రెస్  నుండి కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం టిడిపిలో చేరుతుండటంతో బుట్టాకు కర్నూలు ఎంపి స్ధానంలో చంద్రబాబు మొండి చెయ్యి చూపించారు. ఎంపి టికెట్ పోతేపోయింది కనీసం ఎమ్మిగనూరు అసెంబ్లీ టికెట్ అయినా ఇవ్వమని ప్రాధేయపడింది. చివరకు ఆ టికెట్ ను సిట్టింగ్ ఎంఎల్ఏ జయ నాగేశ్వర రెడ్డికే కేటాయించారు. దాంతో బుట్టా ప్రత్యక్ష ఎన్నికల ఆశ ఆవిరైపోయింది.

 Image result for butta renuka tension

 రాజకీయాల్లోకే మొదటిసారి ప్రవేశించిన బుట్టా రేణుకకు కర్నూలు ఎంపి స్ధానంలో పోటీ చేసే అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి. జగన్ ప్రోత్సాహంతో ఎన్నికల్లో బుట్టా కూడా బాగా ఉత్సాహంగా తిరిగారు. ఉన్నత విద్యావంతురాలన్న ఉద్దేశ్యంతో జగన్ కూడా బుట్టాను బాగా ప్రోత్సహించారు. దాంతో బుట్టా మంచి మెజారిటీ ఎంపిగా గెలిచారు. అయితే, గెలిచిన తర్వాత చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయి టిడిపిలోకి ఫిరాయించారు.  ఎంత నచ్చ చెప్పినా వినకుండా జగన్ మాటను కూడా కాదని చివరకు టిడిపిలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే టిడిపిలోకి ఫిరాయించారో అప్పటి నుండో బుట్టాకు సమస్యలు మొదలయ్యాయి.

 Related image

తమకెవరికీ ఇష్టం లేకుండా టిడిపిలోకి ఫిరాయించిన బుట్టాను టిడిపి సీనియర్ నేతలెవరూ దగ్గరకు చేర్చుకోలేదు. ఎంపి హోదాలో బుట్టా పిలిచే ఏ కార్యక్రమానికి టిడిపి నేతలు హాజరుకాలేదు. అంతేకాకుండా తమ నియోజకవర్గాల్లో జరిగే ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు కూడా బుట్టాను టిడిపి ఎంఎల్ఏలు, నేతలెవరూ పిలిచేవారు కాదు. దాంతో జిల్లాలో బుట్టా ఒంటరైపోయారు. అదే సమయంలో వైసిపి తరపున గెలిచి టిడిపిలోకి ఫిరాయించటంతో జనాలు కూడా బుట్టాను ఛీ కొట్టటం మొదలుపెట్టారు. దాంతో కుడితిలో పడిన ఎలుక పరిస్ధితైపోయింది బుట్ట వ్యవహారం.

 Related image

రాబోయే ఎన్నికల్లో బుట్టాకు టికెట్ వచ్చినా గెలుస్తుందా అన్న అనుమానాలు పార్టీలోనే మొదలయ్యాయి. ఇటువంటి పరిస్దితుల్లో కోట్ల కుటుంబాన్ని చేర్చుకునే ఉద్దేశ్యంతో చంద్రబాబు కర్నూలు ఎంపి టికెట్ కేంద్ర మాజీమంత్రికి కేటాయించారు. దాంతో గెలుపు సంగతి దేవుడెరుగు అసలు టికెట్టే లేకుండా పోయింది. పోనీ ఎమ్మిగనూరైనా ఇవ్వాలంటూ బుట్టా ప్రాధేయపడింది. సిట్టింగ్ ను కాదని ఎలా ఇస్తామని ప్రశ్నించిన చంద్రబాబు ఆ స్ధానంలో సిట్టింగ్ ఎంఎల్ఏ జయ నాగేశ్వరరెడ్డినే అభ్యర్ధిగా ప్రకటించారు.

 Image result for butta renuka tension

చంద్రబాబు ప్రలోభాలకు గురికాకుండా బుద్ధిగా వైసిపిలోనే ఉండుంటే రాబోయే ఎన్నికల్లో రెండోసారి గెలిచే అవకాశం దక్కేదనటంలో సందేహం లేదు. బుట్టాను కాదని జగన్ కూడా టికెట్ ఇంకోరికి కేటాయించే అవకాశం లేదు. ఎంపిగా కాదు ఎంఎల్ఏగానే పోటీ చేస్తానని బుట్టా అనుంటే అక్కడ కూడా టికెట్ దక్కేదేమో ? గెలిచిన మొదటిసారే అత్యాసకు పోవటంతో చివరకు బుట్టా ఎటూ కాకుండా పోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: