సుదీర్ఘ పాదయాత్ర తరువాత జగన్ తన కూతురును చూడటానికి లండన్ ప్రయాణం అయ్యాడు. అయితే దానిని కూడా చంద్ర బాబు రాజకీయ లభ్ది కోసం వాడుకోవాలని చూడటం దురదృష్టకరం. జగన్ లండన్ పర్యటనను తప్పుదారి పట్టించేలా.. దానికి లేనిపోని అంశాలతో జత చేర్చటం ద్వారా రాజకీయ లబ్థి పొందాలని బాబు ప్రయత్నించటం సరికాదంటున్నారు.చేసే ఆరోపణల్లో పస ఉండాలే తప్పించి.. ఏదో చేశామంటే చేశామన్నట్లుగా చేయటం ద్వారా లాభం తర్వాత నష్టం పక్కా అని చెప్పక తప్పదు.

Image result for jagan

జగన్ కుమార్తె లండన్ లో చదువుతుందన్న విషయం అందరికి తెలిసినప్పుడు దానికి డబ్బుల సంచులు తెచ్చుకోవటానికే వెళ్లినట్లుగా ఆరోపించటం వల్ల లాభం ఏమైనా ఉందా? అన్నది ప్రశ్న. నిజానికి జగన్ తో పోలిస్తే చంద్రబాబు ఫ్యామిలీ కానీ.. బాబు కానీ తరచూ విదేశాలకు వెళుతుంటారు. మరి.. ఆయన అలా వెళ్లిన ప్రతిసారి డబ్బుల సంచుల కోసమని ఆరోపిస్తే ఎలా ఉంటుంది?  సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి నోటి నుంచి వచ్చే మాటలు ఆచితూచి అన్నట్లుగా ఉండాలే తప్పించి చిల్లరగా అస్సలు ఉండకూడదు.

Image result for chandra babu

గతంలో పరిమితమైన మీడియా ఉన్నప్పుడు కొన్ని నడిచిపోయాయి. కానీ.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ప్రతి విషయం బయటకు వచ్చే పరిస్థితి. ఇలాంటప్పుడు లేని దాన్ని ఉందని భ్రమించేలా చేయటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువన్న విషయాన్ని బాబు గుర్తిస్తే మంచిది. ఈ తరహా విమర్శలు చేయాలని చెప్పే సలహాదారుల్ని బాబు దూరంగా ఉంచితే మంచిదన్న సూచనలు కొందరు చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: