అనంత పురం లో జేసి ఫ్యామిలీ కి అర్ధ బలం , అంగ బలం రెండు ఉన్నాయని చెప్పాల్సిన పని లేదు . అనంత పురం లో వీరు బలమైన లీడర్స్. అయితే తను అనంతపురం ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉంటానంటూ చాన్నాళ్లుగా హడావుడి చేస్తున్న జేసీ పవన్‌ కుమార్‌ రెడ్డి ఆఖరి నిమిషంలో పునరాలోచనలో పడినట్టుగా తెలుస్తోంది. అనంతపురం ఎంపీ టికెట్‌ వద్దని.. అనంతపురం ఎమ్మెల్యే టికెట్‌ కావాలంటూ జేసీ దివాకర్‌ రెడ్డి తనయుడు ఇప్పుడు కొత్త ప్రతిపాదన పెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. అనంతపురం నుంచి జేసీ దివాకర్‌ రెడ్డి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్నారు.

Image result for jc diwakar reddy

వచ్చే ఎన్నికల్లో తనయుడిని ఆ సీటు నుంచి పోటీచేయించి తను తప్పుకోవాలని ఆయన భావించారు. ఆ మేరకు అన్ని ఏర్పాట్లూ చేసుకొంటూ వస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబును తరచూ కలుస్తూ.. అనంతపురం ఎంపీ సీటు పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సీట్లు అన్నింటిలోనూ తనుచెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలని జేసీ కోరుతూ వస్తున్నారు. అయితే బాబు మాత్రం అందుకు సానుకూలంగా లేరు. ఎన్నికలు దగ్గరపడిన నేపథ్యంలో ఈ విషయంపై పూర్తి స్పష్టత వచ్చేసింది.

అనంతలో రసవత్తర రాజకీయం.. జేసీ పవన్‌ పోటీకి నో?!

అనంతపురం అర్బన్‌, గుంతకల్‌, కల్యాణదుర్గం, శింగనమల వంటి సీట్లకు అభ్యర్థులను మార్చాలి అనేది జేసీ తండ్రీ కొడుకుల కోరిక. అయితే బాబు దానికి సానుకూలంగా లేరు. ఆ నియోజకవర్గాల్లో తాముచెప్పిన వారికి టికెట్లు ఇవ్వాలని వీరు కోరుతున్నారట. అయితే అది సాధ్యంకాదని తేలిపోయింది. జేసీ చెప్పినట్టుగా అభ్యర్థులను బరిలో ఉంచడానికి బాబు అనుకూలంగా లేరట. ఈ నేపథ్యంలో జేసీ పవన్‌ వరసగా మూడు వేర్వేరు సర్వేలు చేయించుకున్నట్టుగా టాక్‌. అనంతపురం ఎంపీ సీటులో తెలుగుదేశం బలం, తనబలం.. అన్నింటినీ ఆ సర్వేల ద్వారా అంచనాలు వేయించుకున్నారట. మూడింటిలోనూ నెగిటివ్‌ రిజల్ట్సే వచ్చాయని.. ఇంత తెలిశాకా.. అనంతపురం ఎంపీ బరిలో నిలవడం పట్ల పవన్‌ అంత సానుకూలంగా లేరని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: