కర్నూల్ భహిరంగ సభలో ప్రసంగించిన పావన్ కళ్యాణ్ కు ఒక రైతు నిజంగానే ఝలక్ ఇచ్చాడు. ఏకంగా స్టేజ్ మీదనే జగన్ తో కలిసి గెలించమని అడిగారు. పవన్‌కళ్యాణ్‌తో మాట్లాడుతూ, 'ఈసారికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పనిచేస్తే బావుంటుంది..' అంటూ వ్యాఖ్యానించేసరికి జనసేన శ్రేణులు షాక్‌కి గురయ్యాయి. ఇలాంటి మాట వినాల్సి వస్తుందని కలలో కూడా ఊహించని పవన్‌ అయితే కాస్సేపు ఏం మాట్లాడాలో తెలియక మిన్నకుండిపోయారు. జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్‌ పరిస్థితీ ఇందుకు భిన్నంగా ఏమీలేదు. 

Image result for pavan kalyan in kurnool

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో జనసేన, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు పలకడం ఎంతో కొంత జనసేనకే మంచిది. జనసేన ద్వారా వైఎస్సార్సీపీకి వచ్చే అదనపు బలమేమీ వుండదు. ఒకవేళ టీడీపీ - జనసేన కలిసి పనిచేసినా వైఎస్సార్సీపీకే ఎంతో కొంత మేలు జరుగుతుంది. అదే, జనసేన గనుక ఒంటరి పోరుకి దిగితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంతో కొంత చీలితే వైసీపీ విజయావకాశాల్ని కాస్తయినా దెబ్బతీస్తుందేమోనన్న ఆందోళన వైసీపీ కింది స్థాయి నేతల్లో వ్యక్తమవుతోంది. 

Image result for pavan kalyan in kurnool

ఇదిలా వుంటే, గత కొంతకాలంగా జనసేన పార్టీ తన ప్రాబల్యాన్ని క్రమక్రమంగా కోల్పోతూ వస్తోంది. మొదట్లో 8 శాతం వరకూ కన్పించిన ఓటు బ్యాంకు, తర్వాత క్రమంగా పడిపోయి 6 శాతానికి వచ్చింది. ఇప్పుడది 4 శాతం కూడా లేదని తాజా సర్వేల్లో వెల్లడవుతోంది. ఈ పరిస్థితుల్లో పవన్‌, కాస్త ఆలోచించి జగన్‌తో కలవడం మంచిదేమో. ఆ అభిప్రాయమే ఓ రైతు నుంచి వ్యక్తమయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: