ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవర్ని అయినా ఏమైనా అనొచ్చు. అయితే దానికి ఓ విధి విధానం ఉండాలి. చౌకబారుగా కామెంట్స్ చేస్తే జనం మెచ్చరు సరికదా తిప్పి కొడతారు. అయిన దానికి కాని దానికి మీదన పడిపోవడం అంటే అసలుకే ఎసరు వస్తుంది. రాను రానూ రాజకీయాలు బాగా దిగజారిపోతున్నాయి. 


జగన్ని తిట్టే శాఖ :


ఏపీకి సంబంధిని కొందరు మంత్రులు ఉన్నారు. వారికి జగ‌న్ని తిట్టే శాఖలను ఏనాడో కేటాయించేశారు. ఉత్తరాంధ్రకు చైందిన అచ్చెన్నాయుడు, విజయవాడ మంత్రి దేవినేని ఉమా, నెల్లూరుకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ ముగ్గురూ జగన్ పైనే నిత్యం విమర్శలు చేస్తూ ఉంటారు. మరి కొందరు మంత్రులు అవసరం ఉన్నపుడు, బాబు మెప్పు పొందేందుకు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ మధ్యన విశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఈ జాబితాలో చేరిపోయారు. ఇదంతా బాంగానే ఉంది. కానీ మంత్రులకు మరేం పని లేదా తిట్టడమేనా అన్న డౌట్లు వస్తాయి ఎవరికైనా.


రెచ్చిపోమంటున్న బాబు :


ఇక ఎన్నికల సెగ బాగా తగులుతున్న ఏ టైంలో డోస్ ఏ మాత్రం సరిపోవడం లేదని మంత్రులను రెచ్చిపోమని చంద్రబాబు ఏకంగా క్లాస్ తీసుకున్నారట. మంత్రులు మీరంతా ఏమంతా యాక్టివ్ గా లేరు. ప్రతిపక్షాన్ని నేనొక్కడినే విమర్శించాలా. మీరు కూడా చేయి వేయాలిగా. అందరూ అలా పట్టనట్లుగా ఉంటే ఎలా అంటూ బాబు చిర్రుబుర్రులాడినట్లుగా న్యూస్ వైరల్ అవుతోంది. 
మరి మంత్రులకు వేరే శాఖలు ఎందుకు జగన్ని తిట్టే శాఖ అంటూ ఒకే శాఖ ఇచ్చేస్తే పోలా అని సెటైర్లు  పడుతున్నాయి. ఇప్పటికే తెల్లారి లేస్తే మంత్రులు, పార్టీ నాయకులు, మానినేటెడ్ పదవుల్లో ఉన్నవారు అంతా కలసి జగ‌న్ని తిట్టి మార్కులు వేయించుకుంటున్నారు. ఇపుడు బాబు కూడా మరింతగా రెచ్చిపోమంటే ఇక ఏపీలో మాటల యుద్ధం, తిట్ల పురాణం పతాక స్థాయికి చేరినట్లే అనుకోవాలేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: