ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సీజన్ నడుస్తుంది.  మరో రెండు మాసంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఒక పార్టీపై మరో పార్టీ దుమ్మెత్తి పోసుకుంటున్నారు.  ముఖ్యంగా టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల అధినేతలు ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు నానా తంటాలు పడుతున్నారు.  మొన్నటి వరకు వైఎస్ జగన్ పాద యాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లి అధికార పార్టీపై విమర్శలు వర్షం కురిపించారు.  మరోవైపు జనసే అధ్యక్షుడు టీడీపీ, వైసీపీ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. 

కొంత కాలంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ అధ్యక్షులు జగన్ పై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తుతున్నారు.  తాజాగా మరోసారి వైసీపీని లక్ష్యం గా చేసుకొని పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఆంధ్రప్రదేశ్ ను మరో బిహార్ లా మార్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇవాళ టీడీపీ శ్రేణులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ…రాష్ట్రంలో ఉద్రిక్తత సృష్టించి ప్రజలకు అధికార పార్టీపై నమ్మకం సన్నగిల్లేలా కుట్రలు పన్నుతుందని ఆరోపణలు చేశారు.

గతంలో హైదరాబాద్ లో మతకల్లోల్లాలు సృష్టించారని, ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే గల్లీగల్లీకి ఒక రౌడీ తయారవుతారని జోస్యం చెప్పారు. ఎర్రచందనం ఆదాయం పోయేసరికి వైసీపీకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందన్నారు.  ఈ నేపథ్యంలో ఏపిలో అరాచకాలు సృష్టించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తుందని.. చిత్తూరు, ఒంగోలు, దెందులూరు ఘటనలే ఇందుకు ఉదాహరణ అని ఆయన స్పష్టం చేశారు.

రౌడీయిజంపై ఉక్కుపాదం మోపేది టీడీపీ మాత్రమే అని ఆయన పేర్కొన్నారు.  అంతే కాదు ఓటర్ల జాబితాలో అక్రమాలు చేస్తూ తమపై బురుద జల్లేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు.  ఓటర్ల జాబితా పట్ల జాగ్రత్తగా ఉండాలని శ్రేణులకు ఆయన సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: