అందమైన నగరం. ప్రశాంతతకు నిలయం. జీవితంలో ఒక్కసారి అయినా ఈ సిటీకి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎవర్ గ్రీన్ హీరోయిన్ అని సినీ కెమేరా ఏనాడో కితాబు ఇచ్చేసింది. ఆసియా ఖండంలోనే శరవేగంగా అభివ్రుధ్ధి చెందుతున్న నగరం విశాఖ. ఓ వైపు పచ్చని కొండలు, మరో వైపు గంభీర సాగరం. ఇలా అన్ని  కలగలసి ఉన్న సిటీకి ఇపుడు ఏమైంది. రేపు ఏమవబోతోంది,,?


దారుణ హత్య :


తన ఇంట్లో తాను ఉన్న మాజీ కార్పోరేటర్ విజయారెడ్డిని దారుణంగా హత్య చేసి దర్జాగా దోపిడీ చేసుకుని వెళ్ళిపోయారు. మొన్న ఇది జరిగితే  కొన్ని గంటల తరువాత కానీ బయట ప్రపంచానికి నిజాలు ఏవీ తెలియలేదంటే అసలు విశాఖలో శాంతి భద్రతలు సేఫ్ గా ఉన్నాయా అన్న అనుమానాలు రావడం సహజం. నగరం నడి బొడ్డున అక్కయ్యపాలెంలోని అపార్ట్ మెంట్లో ఉన్న విజయారెడ్డిని దారుణంగా చంపేశారు. మరి ఎక్కడ రక్షణ ఉంది. ఇది సగటు విశాఖ పౌరున్ని దొలిచేస్తున్న ప్రశ్నలు.


ఆ దాడి అలా :


ఇక పట్ట పగలు, విశాఖ విమానాశ్రయంలో వీఐపీ లాంజ్లో జగన్ మీద కత్తితో దాడి. ప్రతిపక్ష నాయకుడు, క్యాబినెట్ ర్యాంక్ హోదా కలిగిన నేతపై హత్యాయత్నం జరిగినా పట్టించుకోలేనంతగా విశాఖ రక్షణ వ్యవస్థ దిగజారిపోయిందా అన్న డౌట్లు వచ్చాయి. జగన్ పై దాడి ఎయిర్  పోర్ట్లో జరిగినా బయట సెక్యూరిటీ అంతా లోకక్ పోలీసులదే. మరి వారు అంతలా పనిచెస్తున్నారా అన్న విమర్శలు వచ్చాయి. త్రుటిలో తప్పిపోయింది కానీ లేకపోతే జగన్ ప్రాణాలకు పెను ముప్పే అన్నది నాటి ఘటన చెబుతోంది.


కబ్జాల  పడగ :


విశాఖ ఒకప్పటి నగరం కాదని పాతవారు అంటారు. సిటీ ఎంత వేగంగా అభివ్రుద్ధి చెందుతోందా అంతే వేగంగా నేరాలు కూడా పెరుగుతున్నాయి. బాధితులు కూడా సామాన్యులు కాదు, పెద్ద వారే. తన స్నేహితుడి భూమిని కబ్జా చేశారంటూ ఏకంగా విశాఖ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఏడాది క్రితం ఆరోపించారు. ఇక టీడీపీలో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు సైతం భూ దందాలు దారుణంగా సిటీలో పెరిగాయి అని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి నేరాలు ఎంత దారుణంగా పెరుగుతున్నాయో అర్ధమవుతుంది.


మాజీ ఎమ్మెల్యే కూతురుని చంపేశారు :


రెండేళ్ల క్రిత్రం పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు  కూతురు పద్మను చంపేశారు. దీని వెనక కూడా దారుణమైన నిజాలు బయటకు వచ్చాయి. పోలీస్ అధికారి ప్రమేయంతోనే హత్య జరిగిందని కూడా దర్యాప్తులో వెల్లడైంది. ఇక పట్ట పగలు విశాఖ నడి రోడ్డుపైన నడిచే అవకాశాలు లేవని అంటున్నారు. ఎక్కడలేని గ్యాంగులు సెటిల్మెంట్ టీములు ఇక్కడ తిష్ట వేసి మరీ హత్యలు చేస్తున్నారని అంటున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటివి ఎన్నో జరిగాయి.


ముఖ్యంగా విశాఖ  సీపీగా మహేష్ చంద్ర లడ్డా వచ్చాక పరిస్థితి మరింత దారుణంగా తయారైందని అంటున్నారు. పోలీసింగ్ అన్నది కనిపించడం లేదని చెబుతున్నారు. ఎటు చూసినా హత్యలు, మాన భంగాలు, కిడ్నాపులు, దోపిడీలు వరసగా జరుగుతున్నాయి. దీంతో సిటీ అంటేనే భయపడే పరిస్థితి వచ్చేసింది. మరి విశాఖను రోల్ మోడల్ సిటీగా చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఈ విషయాలపై ద్రుష్టి పెట్టాలి. లేకపోతే సుందర నగరం చిందరవందర నగరం అవుతుందని నగర వాసులు ఆందోళన చెందుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: