నివాసం, పార్టీ కార్యాలయం విషయంలో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్ధుల నోళ్ళు మూయించాడు. ఇంతకాలం పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలన్నా, మీడియా సమావేశాలు పెట్టాలన్నా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోని కేంద్ర కార్యాలయంలోనే నిర్వహించేవారు. ఇకనుండి ఆ అవసరం లేదు. ఎందుకంటే అమరావతి పరిధిలోని తాడేపల్లి మండలం బైపాస్ రోడ్డు పక్కనే నిర్మించిన ఇంట్లోకి ప్రవేశించారు. ఈరోజు ఉదయం 8.19 గంటలకు గృహప్రవేశం జరిగింది.


భార్య భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, సీనియర్ నేతలతో కలిసి జగన్ నూతన గృహ ప్రవేశం చేశారు. తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఒకే కాంపౌండ్ లో నిర్మించిన ఇల్లు, పార్టీ కార్యాలయం ఇక నుండి నేతల తాకిడితో కళకళ లాడనుంది. సిఎంగా ఉన్న చంద్రబాబుకు సొంత ఇల్లు లేకపోయినా ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ మాత్రం సొంత ఇంటిని నిర్మించుకోవటం గమనార్హం.

 

గృహ ప్రవేశం జరిగే ముందు సర్వమత ప్రార్ధనలు చేశారు. తర్వాత జగన్ దంపతులు శాస్త్రోక్తంగా కార్యక్రమాలు జరిపించారు. నివాసం విషయంలోను, పార్టీ కార్యాలయం విషయంలోను ఇంతకాలం జగన్ పై విమర్శలు, ఆరోపణలు చేస్తున్న తెలుగుదేశంపార్టీ నేతలకు ఇకనుండి ఆ అవకాశం లేనట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి: