రాజకీయాల్లో కొన్ని కొందరికి అనుకూలిస్తాయి. మరి కొందరికి ఎంతో కలసిరావు. ఏపీ రాజకీయాలు తీసుకుంటే విచిత్రంగా ఉంటున్నాయి. ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయినా ఏపీలో పరిస్తితులు ఒక్కో చోట ఒక్కోలా ఉంటున్నాయి. మొత్తంగా నవ్యాంధ్రను ఒకటిగా చూడాలనుకుంటే సాధ్యం కావడం  లేదు. 


జగన్ కి అలా :


వైసీపీ తొలిసారి పోటీ చేసినపుడు ఏపీలోకిఎనిమిది  జిల్లాలు భారీ షాక్ ఇచ్చేశాయి. జగన్ పార్టీ అద్భుత ప్రదర్శన అంతా సీమలోని మూడు  జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు వరకే పరిమితమైంది. ఇక మిగిలిన ఎనిమిది  జిల్లాలలో  అనంతపురం,  క్రిష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర లో మాత్రం జగన్ కి గట్టి దెబ్బేశాయి. ఇక్కడ టీడీపీకి జై కొట్టాయి. దానికి రాజకీయ కారణాలు అనేకం ఉన్నా వైసీపీకి మాత్రం నిరాశనే మిగిల్చాయి.  ఇక్కడ మెజారిటీ సీట్లు ఉన్నాయి. అవే రివర్స్ కావడంతో జగన్ అధికార పీఠం అందుకోలేకపోయారు.


మొత్తంలో నాలుగో వంతు :


ఉత్తర కోస్తా జిలాలుగా చెప్పుకునే ఏడింటిలో మొత్తం 101  అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో జగన్ కి వచ్చినవి ఇక్కడ అచ్చంగా కేవలం 24 సీట్లు మాత్రమే. ఇందులో ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాల్లో 34 అసెంబ్లీ సీట్లు ఉంటే కవలం తొమ్మిది వైసీపీకి వచ్చాయి. ఇక ఉభయగోదావరి జిల్లాలో 34 సీట్లు ఉంటే వచ్చింది కేవలం అయిదు మాత్రమే. ఇందులో పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ బోణీ కూడా కొట్టలేకపోయింది. ఇక క్రిష్ణా గుంటూర్ జిల్లాలు కలుపుకుని 33 సీట్లు ఉంటే జగన్ పార్టీకి వచ్చినవి కేవలం పది సీట్లు మాత్రమే. ఇక అనంతపురం జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ సీట్లు ఉంటే కేవలం రెండు సీట్లు మాత్రమే జగన్ పార్టీ సాధించింది.


బలపడిందా :


ఇక గత అయిదేళ్ల కాలంలో రాజధాని ప్రాంతంలోని క్రిష్ణా గుంటూరు జిల్లాలో టీడీపీ బాగా బలపడింది. బాబు ప్రభుత్వం అన్ని రకాలుగా వారికే చూడడంతో మరింతగా పట్టు  పెంచుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల్లో టీడీపీ పట్ల వ్యతిరేకత ఉన్నా అది వైసీపీకి ప్లస్ అవుతుందని చెప్పలేని స్థితి, ఇక ఇక్కడ జనసేన పవన్ ఫ్యాక్టర్ కూడా ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లొ  మునుపటి బలం వైసీపీకి ఉందా అంటే చెప్పడం కష్టమే. ముఖ్యంగా వైసీపీ గెలిచిన సీట్లన్నీఏజెన్సీలోనివే. మిగిలిన ప్రాంతాలో వైసీపీని ధీటుగా ఎంతవరకూ తీర్చిదిద్దారో ఇప్పటికీ తెలియదు. అలాగే అనంతపురం జిల్లా తీసుకుంటే అక్కడ ఇప్పటికీ టీడీపీ బలంగానే ఉంది.


బహుముఖ పోరు :


ఇక గత ఎన్నికల్లో బాబు, జగన్ మధ్యనే పోటీ ఉంది. ఈసారి అలాకాదు, బహుముఖీయ పోటీలు ఉన్నాయి. దాంతో ప్రభుత్వ ఓటు చీలుతుంది. ఇక ఈసారి  జగన్ ప్రతిపక్ష పాత్ర పైన కూడా జనం తీర్పు చెబుతారు. ఆ విధంగా చూసుకుంటే గతసారి కంటే కూడా ఈసారి మరింతగా ఏటికి ఎదురీదాల్సి  ఉంటుందని అంటున్నారు. కేవలం తన చరిస్మాను, ప్రభుత్వ వ్యతిరేకతను నమ్ముకుని బరిలోకి దిగుతున్న వైసీపీ మరిన్ని ఎత్తులు వేయకపోతే ఈ జిల్లాలు మళ్ళీ ఝలక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: