కర్నూలు జిల్లా వైసిపిలో అనూహ్య మార్పులు చోటు చేసుకోబోతున్నాయా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అందరిలోను అవే అనుమానాలు మొదలయ్యాయి. సంవత్సరాల తరబడి వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా మెలిగిన గౌరు కుటుంబం టిడిపిలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జరుగుతున్న ప్రచారం గనున నిజమే అయితే గౌరు కుటుంబం విషయంలో జగన్ తప్పు చేస్తున్నట్లే అనుకోవాలి.

 

కర్నూలు జిల్లాలో చాలామంది నేతలు అవసరార్ధం ఎన్నోపార్టీలు మారారు. కానీ జిల్లాలోని పాణ్యం నియోజకవర్గానికి చెందిన  గౌరు వెంకటరెడ్డి, గౌరు చరితారెడ్డి మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తోనే ఉన్నారు. వైఎస్ కష్టకాలంలో ఉన్నా కూడా వైఎస్ ను వదలలేదు. సిఎంగా ఉన్నపుడు గౌరు వెంకటరెడ్డిని చూడటానికి వైఎస్ ఏకంగా జైలుకే వెళ్ళటం అప్పట్లో తీవ్ర సంచలనమైంది. అంటే వైఎస్, గౌరు కుటుంబం మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలుండేవనటానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.

 

అలాంటిది వైఎస్ హఠాత్తుగా మరణించటంతో కాంగ్రెస్ లో ఉన్న గౌరు కుటుంబం వైఎస్ జగన్ కు మద్దతుగా నిలిచారు.  2014  రాష్ట్ర విభజన నేపధ్యంలో  కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎంఎల్ఏ కాటసారి రాంభూపాల్ రెడ్డి ఇండిపెండెంట్ గా పోటీచేసి తర్వాత బిజెపిలో చేరారు.  వైసిపి తరపున పోటీచేసిన గౌరు చరితారెడ్డి పాణ్యం నుండి గెలిచారు. అయితే రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాటసాని జగన్ గూటికి చేరారు.

 

ఎప్పుడైతే కాటసాని వైసిపిలో చేరారో అప్పటి నుండి గౌరు కుటుబంలో అభద్రత మొదలైంది. దానికి తగ్గట్లే పాణ్యం టికెట్ ను కాటసానికే అంటూ జగన్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని గౌరు కుటుంబం తనతో భేటీ అయినపుడు జగన్ స్పష్టంగా చెప్పారట. కావాలంటే ఎంఎల్సీ పదవి ఇస్తానని గౌరు దంపతులకు జగన్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

 Image result for katasani ram bhupal reddy

దాంతో వైసిపికి రాజీనామా చేసి గౌరు దంపతులు టిడిపిలో చేరటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారట. పదవులు ఈ రోజుంటాయి రేపు పోతాయి. కానీ దశబ్దాలుగా వైఎస్ కుటుంబానికి సన్నిహితులుగా, విశ్వాసంగా ఉన్న గౌరు దంపతుల ను వదులుకుంటే మాత్రం జగన్ కే నష్టం.


మరింత సమాచారం తెలుసుకోండి: