పుల్వామా ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ మేరా బూత్ సబ్ సే మజ్బూత్ పేరుతో వీడియో కాన్ఫరెన్స్ లో స్పందించారు. నమో యాప్ ద్వారా 15 వేల లొకేషన్స్ నుంచి మోదీ ప్రసంగాన్ని కార్యకర్తలు చూస్తున్నారు. ఈ సందర్భంగా మోదీ భావోద్వేగంగా మాట్లాడారు.  ఇది ప్రపంచంలోనే ఇది అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్ అని బీజేపీ చెప్పుకుంటున్నది.  భారత సైనికులపై మాకు పూర్తి నమ్మం ఉంది.
Image result for indian army pakistan
ఐక్యంగా పోరాడుదాం..మాలో ఆత్మ విశ్వాసం ఉందని అన్నారు. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు..పాకిస్థాన్, భారత్ కి నష్టం చేయాలని కంకణం కట్టుకుంది. పాక్ మనల్ని అస్థిర పరచడానికి చూస్తున్నది. మన అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నది.  దేశ రక్షణ కోసం ఎలాంటి చర్యలకైనా సిద్దమే   అంటూ మోదీ భావోద్వేగంగా మాట్లాడారు.
Image result for indian army pakistan
ఉగ్ర దాడుల ద్వారా పాకిస్థాన్.. భారత్‌ను విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నదని మోదీ విమర్శించారు. ఇప్పుడు మనం అందరం సైనికుల్లాగే అప్రమత్తంగా ఉండాలి.  మన సైనికులు సరిహద్దులో, సరిహద్దు అవతల కూడా తన పరాక్రమాన్ని చూపించారు. ఇండియా ఒక్కటిగా జీవిస్తుంది.. ఒక్కటిగా పోరాడుతుంది.. ఒక్కటిగా గెలుస్తుంది.. ఇండియా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు అని మోదీ స్పష్టం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: