అన్న నందమూరి ఘనత వహించిన మహా నాయకుడు. ఇందులో ఎంటువంటి సందేహం లేదు. అలాగే త్రిశత చిత్ర నటుడు. ఆయన వేయని వేషం లేదు. చేయని పాత్ర లేదు. ఆయన కీర్తి మేరునగం. ఆయన ప్రతిభా పాటవాలు హిమిశిఖర సమానం. అటువంటి నందమూరి తారకరామావు ఎపుడూ ప్రజల మనిషే. ఆయనకున్న జన బలం ముందు ఎవరూ సాటి రారు. పోటీ కూడా లేదు. 


అటువంటి నందమూరి వారి జీవితం మీద తీసిన సినిమా మహా నాయకుడు. ఆయన రాజకీయ జీవితాన్ని ఇందులో చూపించారు. అయితే ఈ మూవీకి తొలి నుంచి ప్రేక్షకులే కరవు అయ్యారు. అసలు రామారావు అంటేనే మాస్. ఆయన సినిమా వచ్చిందంటే ఆ రోజు పండుగ. అలాంటిది ఆయన జీవితమే ఓ సినిమా అయినపుడు ఎంత ఫ్లోటింగ్ ఉండాలి, ఎంత హడావుడి ఉండాలి. ఇక రాజకీయాల్లోకి వచ్చినపుడు ఆయన సభలకు  ఇసుక వేస్తే రాలనంతగా జనాలు వచ్చేవారు. అలాంటిది  మహానాయకుడు సినిమాకు ఆడియన్సే లేరంటే అది అన్న గారికే అవమానం.


మరి ఉన్న కధను లేనట్లుగా లేని కధను ఉన్నట్లుగా చెబుతూ తమకు అనుకూలంగా చేసుకోవడానికి ఈ సినిమా తీసారని విమర్శలు వెల్లువెత్తాయి. రామారావు వంటి అజేయున్ని ఆరు కోట్ల మంది అభిమాన నాయకున్ని ఏమీ కాని వానిగా చూపించారు. మన అండ లేకపోతే ఆయన లేరంటూ చెప్పించిన డైలాగులు బాగానే తేడా కొట్టాయి. రామారావు అంటేనే ఓ లెజెండ్. అటువంటి నాయకున్ని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూడడం వల్లనే ఈ సినిమాకు ఆదరణ కరవు అయిందన్నది అందరి మాట.


ఇక తొలి రోజు నుంచి పడిపోయిన సినిమా కలెక్షన్లను లేపడానికి అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఇన్నీ అన్నీ కావు. ఏకంగా చంద్రబాబు టెలి కాంఫరెన్స్ ల్లొనే  మహానాయకుడు చూడండని  పార్టీ వారికి చెబుతున్నారు. ఇక తన మీటింగుల్లో అదే అంటున్నారు.  లేటెస్ట్ గా ఏంటంటే రేషన్ డీలర్ల మీటింగులోనూ బాబు గారు సినిమా ప్రచారానికి తెర లేపారు. రెండు రూపాయల కిలో బియ్యం పధకం తీసుకువచ్చిన విధానం గురించి మహానాయకుడులో చూపించారని, చూడండంటూ బాబు డీలర్లకు చెప్పడం విచిత్రమే. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. ఇలా ప్రచారం చేస్తే వస్తారా ఏంటి. అయినా అన్న గారి అసలు కధను మరుగున పరచి వెన్నుపోటు భాగోతాలను పక్కన పెట్టి తీసిన ఈ మూవీపై జనం ఎపుడో పెదవి విరిచేశారు. ఇక ఈ సినిమా పాట్లతో సర్కార్ పిల్లి మొగ్గలు వేయడమే అసలైన విచిత్రం.


మరింత సమాచారం తెలుసుకోండి: