పాకిస్థాన్ చేతికి భారత ఫైటర్ పైలట్ చిక్కిన సంగతి తెలిసిందే. దీనితో ఒక్క సారిగా భారత్ లో ఆందోళన మొదలైంది. అతన్ని ఏమి చేయకూడదని భారత్ — పాక్ ను కోరుతుంది. భారత్ కు చెందిన పైలట్ అభినందన్ ను  తాము కస్టడీలోకి తీసుకున్నామని పాకిస్థాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అతను కస్టడీలో ఉన్న వీడియోను కూడా రిలీజ్ చేసింది. అయితే ఆ పైలట్ సురక్షితంగా ఉండాలని ఇప్పటికే భారత ప్రజలు కోరుకున్నారు. 


పాక్ కు దొరికిన భారత కమాండర్ పరిస్థితి ఏంటి ...?

ఇందులో భాగంగా ఢిల్లీలోని పాకిస్థాన్ డిప్యూటీ హైకమిషనర్ సయిద్ హైదర్ను పిలిపించుకుని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరసన వ్యక్తం చేసింది. ఎట్టకేలకు పాకిస్థాన్ ప్రభుత్వం భారత ఫైలట్ ను విడుదల చేయడానికి అంగీకరించింది. రేపే అంటే శుక్రవారం విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే ప్రపంచ దేశాల ఒత్తిడి వల్ల పాకిస్థాన్ తగ్గిందని క్లీయర్ గా అర్ధం అవుతుంది. 


పాక్ కు దొరికిన భారత కమాండర్ పరిస్థితి ఏంటి ...?

ఇప్పటికే ఐక్యరాజ్య సమితి కూడా పాకిస్తాన్ ను షాక్ ఇచ్చిన వేళ , భారత్ కు మద్దతు పెరుగుతుండటం తో పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. కాగా  పాకిస్థాన్ కస్టడీలో ఉన్న వింగ్ కమాండర్ విక్రమ్ అభినందన్ స్వస్థలం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తిరుపణవూరు. అభినందన్ తండ్రి రిటైర్డ్ ఎయిర్ మార్షల్. తమిళనాడులోని ఉడుమలైపేటలోని సైనిక్ స్కూల్లో అభినందన్ చదివారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: