ఎన్నికలకు మరి కాస్తా ముందుకు టైం వచ్చేసింది. ఇక తొందరలొనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. దాంతో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్ధుల ఎంపికలో పడిపోయాయి. ఏపీలో ప్రధాన పక్షాలైన టీడీపీ, వైసీపీల్లో ఎవరు ముందుగా అభ్యర్ధులు ప్రకటిస్తారన్నది సస్పెన్స్ గా ఉంది. ఓ వైపు బాబు అభ్యర్ధుల ఎంపికలో బిజీగా ఉంటే జగన్ కూల్ గా కనిపిస్తున్నారు.


ఎంపిక ఐపోయిందా :


జగన్ పార్టీలో అభ్యర్ధుల ఎంపిక పూర్తి అయిపోయిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. నిన్న లోటస్ పాండ్ లో జగన్ పార్టీ నేతలతో నిర్వహించిన రివ్యూ మీటింగులో అభ్యర్ధులను తొందరలోనే ప్రకటిస్తానని చెప్పడం దీనిని సూచిస్తోంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వచ్చిన ఒకటి రెండు రోజుల్లోనే అభ్యర్ధులను మొత్తానికి మొత్తం ప్రకటిస్తామని జగన్ నాయకులతో అనడం విశేషం. దీన్ని బట్టి జగన్ అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేసేసుకున్నారని అర్ధమవుతోంది. ఇక మరో వైపు  టీడీపీ ఇంకా కొన్ని చోట్ల అభ్యర్ధుల ఎంపిక చేస్తూనే ఉంది.


ఇలా అయితే ఎలా :


అభ్యర్ధులను ఒకే మారు  ప్రకటించి బస్సు యాత్రకు వెంటనే వెళ్ళిపోతానని జగన్ చెబుతున్నారు. అలా అయితే టికెట్ రాని వారి సంగతేంటి. వారు పార్టీలో తిరుగుబాట్లు చేస్తారు. చాలా  చోట్ల తలనొప్పులు తెస్తున్న వారు కూడా ఉన్నారు. ఇప్పటికే వైసీపీలో చాలా వర్గాలు ఉన్నాయి. మరి అందరికీ నచ్చచెప్పి టికెట్ ఇవ్వాలి. అలాగైతేనే పార్టీకి మంచి ఫలితాలు వస్తాయి. చంద్రబాబు చేస్తున్నది అదే. మరి జగన్ అలా చేయకుండా ఎకాఎకిన అభ్యర్ధులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళిపోతే పార్టీలో సెగలు పొగలు రాజుకుంటాయని నాయకులు ఆందోళన చెందుతున్నారు. 


తగవులు ముదిరేనా :


ఇప్పటికే పాత వారుండగా కొత్తవారు పార్టీలోకి వస్తున్నరు. వారిని అకామిడేట్ చేయడానికి పాతవారిని పక్కన పెడుతున్నారు.  ఈ గొడవలు ఇలా ఉంటే ఒక్కో అసెంబ్లీ సీట్లో ముగ్గురు నలుగురు ఇంచార్జులు కూడా ఉంటూ పార్టీను గ్రూపులుగా నడుపుతున్నారు. దీన్ని జగన్ మరి ఎలా అధిమగిస్తారో చూడాలి. ఒకవేళ తన బస్సు యాత్రలోనే ఈ గొడవలను తీరుస్తారో ఏమో ఏది ఏమైనా మొత్తం అభ్యర్ధుల విషయంలో జగన్ అయితే పక్కా క్లారిటీతో ఉన్నారని మాత్రం వార్తలు వెలువడుతున్నాయి. దీంతో ఎవరికి టికెట్ వస్తుందో, మరెవరికి టిక్కు పడుతుందోనని వైసెపీ నేతలు హడలిపోతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: