అభినందన్ వర్థమాన్ .. ప్రస్తుతం యావత్ భారతదేశం మారు మోగుతున్న పేరు. పాకిస్తాన్ చెరలో ఉన్న భారత్ మిగ్ -21 ఫైటర్ పైలెట్ అభినందన్.. మరికొన్ని గంటల్లో భారత్ చేరుకోనున్నారు. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్.. అభినందన్ ను భారత్ కు అప్పగించేందుకు అంగీకరించింది. పాకిస్తాన్ కు చిక్కిన అనంతరం అభినందన్ ఏం చేశాడు..? ఎలా గడిపాడు..? పాకిస్తాన్ సైన్యం అభినందన్ ను ఏమడిగింది..? పాకిస్తాన్ సైన్యానికి అభినందన్ ఎలా చిక్కాడు... వారి చేతిలో బంధీగా చిక్కక ముందు వర్థమాన్ ఏం చేశాడు.. ఇవన్నీ ఆసక్తి కలిగిస్తున్న అంశాలు. అయితే వీటన్నిటికీ పాకిస్తాన్ మీడియానే స్వయంగా సమాధానం చెప్పింది. అభినందన్ వంటి ధైర్యవంతుడిని ఎక్కడా చూడలేదంటూ పాకిస్తాన్ మీడియా కొనియాడింది.

Image result for abhinandan army

పాక్ విమానాలను సమర్థంగా తిప్పికొట్టే క్రమంలో మన జెట్ ను పాకిస్తాన్ కూల్చింది. అయితే ఆ విమానం పాకిస్తాన్ భూభాగంలో కుప్పకూలింది. తాను పాకిస్తాన్ గడ్డపై ఉన్నానని తెలిసిన వెంటనే తన వద్ద ఉన్న మ్యాప్ లు, ఇతర పత్రాలను మింగేయడానికి ఫైటర్ పైలట్ అభినందన్ ప్రయత్నించాడు. మరికొన్నింటిని నీటిలో తడిపేశాడు. స్ధానిక యువకుల నుంచి తప్పించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని హోరాన్ గ్రామానికి చెందిన ప్రత్యక్ష సాక్షి మహమ్మద్ రజాక్ చౌదరి ఈ విషయాలు వెల్లడించారు.

Image result for abhinandan army

మన ఫైటర్ పైలట్ అభినందన్ తీరును పాక్ మీడియా సైతం ప్రశంసించింది. పాక్ గడ్డపై కూడా భారత్ మాతాకీ జై అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారని తెలిపింది. ఆకాశం నుంచి కింద పడిపోతున్న అభినందన్ ను గమనిస్తున్న ఆ గ్రామ ప్రజలు అతనిని చుట్టుముట్టారు. గుంపుగా చేరుతున్న వారిని చూసి తేరుకున్న అభినందన్... ఇది ఏ దేశమని వారిని ప్రశ్నించాడు.. అయితే గుంపులో ఉన్న ఒక వ్యక్తి ఇది ఇండియా అంటూ తప్పుడు సంకేతమిచ్చాడు. అంతే అభినందన్ గర్వంగా నినాదం చేశాడు. భారత్ మాతాకి జై అన్నాడు. ఇది పాక్ పౌరులకు నచ్చలేదు... అభినందన్ ఇండియన్ అని తెలుసుకొని వ్యతిరేక నినాదాలు చేశారు. విషయాన్ని అర్ధం చేసుకున్న అభినందన్ ఏ మాత్రం భయపడలేదు. వెనక్కి తగ్గలేదు. గుంపులుగా అక్కడకి పాక్ మూకలు దాడి చేస్తున్నా ఏమాత్రం తొణకలేదు. తాను ఒక్కడినే అని తెలిసినా బెదరకుండా భారత్ మాతాకి జై అంటూ నినదించాడు. అభినందన్ ముక్కుమీద, ముఖం మీద విపరీతంగా కొట్టారు. దెబ్బలు కొడుతున్న సమయంలోనే అక్కడికి పాకిస్తాన్ ఆర్మీ చేరుకొని అతనిని అదుపులోకి తీసుకుందని పాకిస్తాన్ పత్రిక డాన్ పేర్కొంది. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్ ఇప్పుడు అభినందన్ ను విడుదల చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: