ఎన్నికలు అంటే గెలిచే వారికి హుషార్, ఓడే వారికి బేజార్. రేపటి ఎన్నికల్లో ఏమి జరుగుతుందోన్న కంగారు ఇపుడు అధికార తెలుగుదేశం పార్టీలోని మంత్రులకు కూడా  పట్టుకుంది. అందుకే గెలుపు దారులువెతుక్కుంటున్నారు.  పైకి మాత్రం  మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. తామే గెలుపు గుర్రాలమని గొప్పలు పోతున్న మంత్రులే ఇపుడు కొత్త దారులు వెతుక్కోవడం ఇంటెరెస్టింగ్ మ్యాటరే.


తెర  మీదకు లోకేష్  :


మంత్రి లోకేష్ ని భీమిలీ బరిలో దింపాలన్న ఆలోచన అచ్చంగా విశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుదేనట. ఈ అవసరం ఎందుకొచ్చిందన్నదే ఇక్కడ ప్రశ్న. నిన్నటి వరకూ భీమిలీ సీటు వదలనని, అక్కడ నుంచే పోటీ చేస్తానని గట్టిగా చెప్పిన గంటాకు ఇపుడు అక్కడ తన నిన్నటి నేస్తం అవంతి శ్రీనివాసరావు పోటీకి దిగడం, పైగా వైసీపీ నుంచి బరిలో ఉండడంతో బెంబేలెత్తుతున్నారని సెటైర్లు పడుతున్నాయి. దాంతో భీమిలీ సీటుని వదిలేస్తే ఓటమి భయంతో పారిపోయారన్న విమర్శ వస్తుందని తెలివిగా మధ్యలో లోకేష్ పేరుని తెచ్చారని అంటున్నారు.


ఉత్త మాటేనా :


నిజానికి లోకేష్ ఇప్పటి వరకూ ఎమ్మెల్సీ సీటుకు రాజీనామా  చేయలేదు. ఆయన అసలు పోటీ చేస్తాడో లేదో తెలియదు.  ఒకవేళ చేసినా భీమిలీ వస్టాడన్న నమ్మకం అంతకంటే లేదు. లోకేష్ పేరు చెప్పి భీమిలి నుంచి తప్పించుకుని వేరే చోటకు పోటీకి దిగాలన్నది గంటా ప్లాన్ అని వైసీపీ నేతలతో పాటు, సొంత పార్టీ నేతలు అంటున్నారు. గంటా భీమిలీలో పోటీ చేస్తే ఓటమి తధ్యమని కొన్ని నెలల క్రితమే టీడీపీ అనుకూల మీడియా సర్వే బయట పెట్టేశింది.


దాంతోనే అప్పట్లో మంత్రి గారు గుస్సా అయ్యారు కూడా. ఇక మంత్రికి  ఇపుడు ధీటైన క్యాండిడేట్ గా అవంతి ఉన్నారు. పెద్ద ఎత్తున వైసీపీలో చేరికలు అక్కడ జరుతున్నాయి. దాంతో లోకేష్ అంటున్నారని విమర్శలు వస్తున్నాయి. నిజానికి గంటా ఏదో విధంగా భీమిలీని వదిలేసి విశాఖ ఉత్తరం, లేదా గాజువాక నుంచి పోటీ చేస్తారని అంటున్నారు.  అయితే సీటు మారినా ఫేట్ మారకపోతే మంత్రి గారికి అక్కడ కూడా చుక్కలే కనిపిస్తాయని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: