పుల్వామా దాడి తర్వాత భారత్  పాక్ మద్య యుద్ద మేఘాలు అల్లుకున్న విషయం తెలిసిందే.  పుల్వామా దాడికి భారతీయ వైమానిక దళం పాక్ ఆక్రమిత ప్రదేశంలోకి చొరబడి మూడు వందల మంది ఉగ్రమూకలను హతమార్చింది.  దాంతో పాక్..భారత్ పై పగతీర్చుకోవాలనే ఉద్దేశంతో రగిలిపోతుంది. ఈ నేపథ్యంలో వైమానిక దాడి కూడా చేసింది..కానీ ఆ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టారు భారత వైమానిక దళం.  ఈ క్రమంలోనే ఐఏఎఫ్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ పాక్ సైనికులకు పట్టబడ్డాడు.  అయితే భారత్ తీసుకు వచ్చిన వత్తిడితో నిన్న అభినందన్‌ ని విడుదల చేస్తామని పాక్ ప్రదాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటన చేశారు. 

Image result for ఢిల్లీ హై అలర్ట్

నేడు భారత్ భూభాగంలోకి అడుగు పెడుతున్నాడు అభినందన్.  మరోవైపు  పాకిస్థాన్— భారత్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల క్రమంలో దేశంపై టెర్రరిస్టులు దాడిచేసే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  దేశ రాజధానిలోని 29 కీలక ప్రాంతాలపై గురిపెట్టాయని కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి. దీంతో రాజధానిలో కేంద్ర హోం శాఖ హై అలర్ట్‌ ప్రకటించింది. సమస్యాత్మక ప్రాంతాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లతోపాటు బస్టాండ్‌లలో భద్రత కట్టుదిట్టం చేశారు. 

Image result for ఢిల్లీ హై అలర్ట్

జనావాసాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను టెర్రరిస్టులు టార్గెట్ చేస్తారనే సమాచారం ఉండటంతో.. భారీ ఎత్తున పోలీసులను మోహరించింది. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నగరాన్ని హై అలర్డ్ జోన్ గా ప్రకటించింది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో పౌరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.  ఉగ్రమూకల కోసం డేగ కళ్లతో అన్వేషిస్తున్నారు. మెట్రో ప్రయాణీకులు క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతే వారికి అనుమతినిస్తున్నారు. ఢిల్లీ మొత్తంగా నిఘా నేత్రంలో కొనసాగుతోంది. గతంలో పార్లమెంట్ పై దాడి క్రమంలో పార్ల మెంట్ భవనం వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. 

మరింత సమాచారం తెలుసుకోండి: