ప్రతి వారిలో బలహీనతలు కొన్ని ఉంటాయి. ఇక రాజకీయ నాయకుల విషయం చెప్పక్కర్లేదు. అధికారం కోసం అర్రులు చాచే వారు ఎన్ని పిల్లి మొగ్గలైనా వేస్తారు. అవి చరిత్ర పుటల్లో అలా పదిలంగానే ఉంటాయి. ఎప్పటికి ఏది అవసరమో ఆల చేసుకుంటూ పోతూ రాజకీయ పబ్బం గడుపుకోవాలకునేవారు వెనక్కి తిరిగి  ధైర్యంగా  చూసుకోలేరు.


అవినీతి, బంధుప్రీతి :


దీని మీద ఓ పాత పాట మహా కవి శ్రీశ్రీ రాసింది ఉంది. ఇదే పాటను ఇపుడు ప్రధాని మోడీ పదే పదే పాడుతున్నారు. ఏపీకి వచ్చినపుడలా ఆయన అవినీతి, బంధుప్రీతి అంటూ చంద్రబాబుతో చెడుగుడు ఆడేసుకుంటున్నారు. కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలు అంటూ డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. విశాఖ సభలోనూ మోడీ చంద్రబాబుపైన  హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో అబద్దాల పాలన నడుపుతున్నారని, అవినీతి విశ్వవ్యాప్తం  చేశారని మోడీ  విరుచుకుపడ్డారు. వారసత్వ పాలన చేస్తున్నారంటూ చంద్రబాబు ముఖ్యమంత్రి, కొడుకు లొకేష్ మంత్రి అన్న విషయం ప్రస్తావించారు.


ఇన్ని యూ టర్నులా :


బాబుకు ఎక్కడ కెలికితే మండుతుందో అక్కడే కెలికారు మోడీ. దేశంలో ఇన్ని యూ టర్నులు తీసుకునే రాజకీయ నాయకుడు ఎవరూ లేరంటూ బాబును దుయ్యబెట్టారు. ప్రతి విషయంలోనూ  బాబు అసమర్ధ నిర్ణయాలు, రూట్ మార్చుకుంటూ అవకాశ వాద రాజకీయలు చేయడం ద్వారా యూ టర్నులు ఎన్నో  తీసుకుంటున్నారని మోడీ అన్నారు. తన తప్పులను కేంద్రంపై రుద్దుతూ తాను పవిత్రుడిని అన్నట్లుగా చెప్పుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారని మోడీ  ఘాటుగా విమర్శించారు. 


పాక్ కి ఊతమిస్తారా :


యుద్ధం పేరుతో మోడీ రాజకీయలు చేస్తున్నారంటూ ఈ మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కామెంట్స్ వైరల్ గా మారిన సంగతి విధితమే. గోద్రా అల్లర్లు వెనక ఉన్న మోడీ ఏమైనా చేసేందుకు రెడీయేనని కూడా బాబు అనడం సెన్సేషన్ అయింది. దాని మీద సోషల్ మీడియాలో కూడా నెగిటివ్ గా ట్రోల్ అయింది కూడా. దీన్ని ద్రుష్టిలో ఉంచుకుని మోడీ పాకిస్తాన్ కి మద్దతుగా మాట్లాడుతారా అంటూ బాబుపైన అటాక్ చేశారు. పాక్ పార్లమెంట్ లో మీ వీడియోలే వైరల్ అవుతున్నాయని, ఇదేనా దేశ భక్తి అంటూ నిలదీశారు. ప్రపంచం అంతా భారత్ కి మద్దతు ఇస్తూంటే మీరు మాత్రం వారి నైతిక స్థైర్యం దెబ్బ తీస్తారా అంటూ అటాక్ చేశారు.


అదిరిపోయే సభ :


విశాఖలో జరిగిన మోడీ సభ అదిరిపోయింది. దాదాపుగా ముప్పయి వేలమందికి పైగా ప్రజలు తరలి రావడంతో బీజేపీ నాయకులు హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇక మోడీ కోసం గ్రౌండ్ బయట కూడా వేలాదిగా వేచి ఉండడం కనిపించింది. పాకిస్థాన్ పీచమణిచి ఏపీకి వచ్చిన ప్రధానికి విశాఖ జనం గ్రాండ్ వెల్ కం పలికారు. అదే సమయంలో టీడీపీ, ఇతర పార్టీలు చేసిన నిరసనలు ఎవరూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. మోడీ హవా మళ్ళీ బలంగా వీస్తుందనడానికి మేధావులు, మధ్యతరగతి పెద్ద సంఖ్యలో ఈ సభలో పాలుపంచుకోవడం నిదర్శనం.


మరింత సమాచారం తెలుసుకోండి: