దేశం మొత్తం అతని కోసం ఎంతో ఆతృత గా ఎదురు చూసింది. జై హింద్ అంటూ నినాదాలతో మారు మ్రోగు పోయింది. పాక్ చెరనుంచి భారత గడ్డ మీద అడుగుపెట్టిన వింగ్ కమాండర్ అభినందన్‌కు అట్టారీ-వాఘా సరిహద్దులో ఘన స్వాగతం లభించింది. మధ్యాహ్నమే అభినందన్‌ను భారత్‌కు అప్పగిస్తామని చెప్పిన పాక్.. రాత్రి 9 గంటల సమయంలో అప్పగించింది. దీంతో గంటల తరబడి నిరీక్షణ అనంతరం ఫార్మాలిటీస్ పూర్తయ్యాక ఆయన భారత్‌లో అడుగుపెట్టాడు.


బ్రేకింగ్ న్యూస్ : భారత్ ఫైలట్ ను రేపే విడుదల చేయనున్న పాకిస్థాన్

దేశభక్తికి ప్రతిరూపంలా కనిపించిన అభినందన్‌ రాకతో దేశ ప్రజలు జై హింద్ నినాదాలతో హోరెత్తించారు. రెండు రోజుల తర్వాత భారత గడ్డ మీద అడుగు పెట్టిన అభినందన్ఆనందం వ్యక్తం చేశాడు. గుడ్ టు బీ బ్యాక్ అంటూ తన స్పందనను తెలియజేశాడు. అమృత్‌సర్ నగర డిప్యూటీ కమిషనర్‌తో మాట్లాడిన సందర్భంగా అభినందన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అభినందన్ తిరిగి సొంతగడ్డపై అడుగుపెట్టడంతో ఆయన కుటుంబ సభ్యులతోపాటు 130 కోట్ల మంది భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

good to be back says abhinandan on return india from pakistan

 పాక్ నుంచి తిరిగొచ్చిన అభినందన్‌కు వైద్యపరీక్షలు నిర్వహించనున్నామని వాయుసేన అధికారులు తెలిపారు. వింగ్ కమాండర్ అభినందన్‌ను పాకిస్థాన్ మాకు అప్పగించడం ఎంతో ఆనందం కలిగించిందన్న ఐఏఎఫ్.. అభినందన్‌ను వైద్య పరీక్షలకు పంపిస్తామంది. పారాచ్యూట్ నుంచి కిందికి దిగిన సమయంలో అతడి శరీరంపై ఒత్తిడి పడుతుంది. కాబట్టి మెడికల్ చెకప్ తప్పనిసరని తెలిపింది. అభినందన్ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నించనున్నారు. పాక్ ఆయనతో ఎలా వ్యవహరించిందో తెలుసుకోనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: