చంద్రబాబునాయుడుపై ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆచరణసాధ్యం కానీ హామీలను చంద్రబాబు ఎందుకిస్తున్నారో అర్ధం కావటం లేదన్నారు. అమలు చేయలేని హామీలను చంద్రబాబు ఇస్తున్నట్లు మోహన్ బాబు అభిప్రాయపడ్డారు. విద్యాభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ది లేదని మండిపడ్డారు. 2014-15 నుండి ఇప్పటి వరకూ తమ విద్యాసంస్ధలోని విద్యార్ధులకు ఫీజు రీ ఎంబర్స్ మెంటు రాలేదని చెప్పటం సంచలనంగా మారింది. ఫీజు రీ ఎంబర్సుమెంటు పై ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసిన పట్టించుకున్న నాధుడే లేరంటూ ఫైర్ అయ్యారు.

 

ఏ రాజకీయ పార్టీకి మద్దతుగానో లేకపోతే ప్రోద్బలంతోనో తాను మాట్లాడటం లేదని చెప్పటం గమనార్హం. ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలనే తాను మాట్లాడుతున్నట్లు తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినట్లు ధ్వజమెత్తారు.  మోహన్ బాబు మీడియా ముందు చేసిన తాజా వ్యాఖ్యలు టిడిపిలో కలకలం రేపుతున్నాయి.

 

ఎందుకంటే, రాబోయే ఎన్నికల్లో మోహన్ బాబు కుటుంబసభ్యుల్లో ఒకరు వైసిపి తరపున పోటీ చేస్తారనే ప్రచారం అందరికీ తెలిసిందే. మోహన్ బాబు కూతురని కాదు కాదు కొడుకే పోటీ చేస్తారని జిల్లాలో వార్తలు హల్ చల్ చేస్తోంది. అందులోను మోహన్ బాబు పెద్ద కొడుకు జగన్ కజిన్ ను వివాహం చేసుకోవటంతో దగ్గరి బంధుత్వం కూడా ఏర్పడింది. దాంతో ప్రచారానికి మరింత ఊపొస్తోంది. బహుశా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే తాను ఏ పార్టీ ప్రోత్సహాంతోనో మాట్లాడటం లేదని వివరణ ఇచ్చుకున్నట్లున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: