ఎన్నికల ముందు టీడీపీ నేతలు చంద్ర బాబు కు షాక్ మీద షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు , ముగ్గురు ఎమ్మెల్యేలు గోడ దూకేశారు. దీనితో చంద్ర బాబు లో కలవరం మొదలైంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సీట్లకు నిర్వహించిన సమీక్షకు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు. పార్టీలో తనకు విలువలేకుండా పోయిందని, తనను అడుగడుగునా అవమానిస్తూ ఉన్నారని, ఎంపీ సీటుకు పోటీ వద్దు అని గత ఎన్నికల్లో చెప్పడంతో తను ఆ సీటును వదులుకున్నట్టుగా చెబుతున్నారట మోదుగుల. 

Image result for chandra babu

చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సమీక్షకే మోదుగుల గైర్హాజరు కావడంతో.. ఆయన తెలుగుదేశం పార్టీని వీడటం లాంఛనమే అని అనుకోవాల్సి వస్తోంది. మోదుగుల టీడీపీకి రాజీనామా చేయవచ్చని కొన్ని రోజులుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరవచ్చనే అంచనాలున్నాయి. గుంటూరు ఎంపీ సీటు పరిధిలో టీడీపీ కి ఇది సెట్ బ్యాక్ అనే చెప్పాలి.

టీడీపీ.. మరో ఎమ్మెల్యే వీడ్కోలేనా..!

కేవలం ఈ నియోజకవర్గం మాత్రమే కాదు.. మరో నాలుగు నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల విషయంలో తెలుగుదేశం పార్టీ తర్జనభర్జనలు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు అంటున్నారు. ఒక సీటు నుంచి నటుడు అలీని బరిలోకి దించడం ఖాయమైందని సమాచారం. తూర్పు నియోజకవర్గం పరిధిలో అలీ ఓటు కూడా రిజిస్టర్ చేయించుకున్నారు. మరి ఉన్నట్టుండి రంగంలోకి వచ్చేస్తే గెలిచేస్తారా ఈ నటుడు అనేది ప్రశ్నార్థకమే. మరోవైపు నర్సాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రచారం పొందిన రఘురామకృష్ణం రాజు ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ను కలిశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: