2019 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార పార్టీ కి షాక్ లు మీద షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే టీడీపీ కి చాలా చోట్లా ఎంపీ అభ్యర్థులు దొరకటం లేదట. మరో పక్క వైస్సార్సీపీ అభ్యర్థులను ఖరారు చేసి మంచి జోష్ లో ఉంది. తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తే.. పది ఎంపీ సీట్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కోసం వెదుక్కొంటోంది! పాతికలో పది సీట్లకు అధికార పార్టీకి సరైన అభ్యర్థులు కనపడటంలేదు. మొదట ఇద్దరు ఎంపీలు రాజీనామా చేశారు.. అవంతి శ్రీనివాస్, రవీంధ్ర బాబు. వాళ్లు ప్రాతినిధ్యం వహించిన స్థానాలకు తెలుగుదేశం పార్టీ ఎవరిని నిలుపుతుందో ఇంకా ఊసేలేదు.

Image result for chandra babu

నరసాపురం నుంచి రఘురామకృష్ణం రాజు పోటీ అన్నారు. ఆయనేమో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చేసుకున్నారు. ఇక మాగుంటను ఏకంగా రెండు ఎంపీ సీట్లకు అభ్యర్థి అనుకుంటున్నారట పాపం! ఒంగోలు, నెల్లూరు.. ఆయనేమో వైసీపీ వైపు చూస్తూ ఉన్నారు. రేపోమాపో ఆ పని కూడా పూర్తికానుంది. నెల్లూరు నుంచి ఎంపీగా అనుకున్న తురుపుముక్క ఆదాల అందుకు నో చెప్పారు. ఎమ్మెల్యేగా పోటీ అంటున్నారు. అయితే ఆయన వైసీపీ వైపు చూస్తున్నారని టాక్!

Image result for chandra babu

అనంతపురంలో జేసీ చేతులు ఎత్తేశారు. ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చకపోతే పోటీ చేసీ ప్రయోజనం లేదని అయన అన్నారు. హిందూపురంలో నిమ్మలను తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఎంపీలుగా పోటీ చేసేది లేదని మురళీ మోహన్, కొనకళ్ల నారాయణ, తోట నరసింహంలు చంద్రబాబుకు తేల్చిచెప్పారు! శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసేందుకు రామ్మోహన్ నాయుడు వెనుకడుగు వేస్తున్న పరిస్థితి. విశాఖ విషయంలో నువ్వుంటే నువ్వు.. అని నేతలు ఒకర్నొరు ముందుకు తోసుకుంటున్నారు. కుర్రాడైన బాలయ్య అల్లుడిని పోటీ చేయించడానికి బాబుకే ధైర్యం లేదని అంటున్నారు. ఏతావాతా ఇదీ పరిస్థితి.ఏకంగా పది ఎంపీ సీట్లలో తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులు ఎవరనే అంశం అంతుబట్టడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: