ఇటీవల భారత జవాన్లపై జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ చేసిన దాడిలో భారత జవాన్లు 40పైగా చనిపోయిన విషయం మనకందరికీ తెలిసినదే. యావత్ దేశం తో పాటు ప్రపంచాన్నే షాక్ కి గురి చేసిన ఈ ఘటన నుండి వెంటనే తేరుకుని పాకిస్థాన్ దేశంలో ఉన్న తీవ్రవాద సంస్థల గుడారాల పై భారత జవాన్లు వంద గంటల లోపే దాడి చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.

Image result for digvijay singh

దీంతో ఈ ఘటనపై త్వరలో దేశంలో లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో దీన్ని రాజకీయం చేసి ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నేత, మద్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద చేసినట్లుగా కనిపిస్తుంది పాకిస్తాన్ లో బారత్ జరిపిన ఆపరేషన్ పై తనకు అనుమానాలు ఏమీ లేవు అంటూనే పాకిస్తాన్ లోని బాలాకోట్ ప్రాంతంలో జరిపిన ఉగ్రదాడి పోటోలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Related image

ప్రస్తుతం పరిజ్ఞానం ప్రకారం శాటిలైట్‌ ఫొటోలు బయటపెట్టడం అంతకష్టమేని కాదని ఆయన పేర్కొన్నారు. వాయుసేన అధికారి అభినందన్‌ను విడిచిపెట్టడంపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు దిగ్విజయ్‌సింగ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Image result for digvijay singh

దీంతో దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ మీడియాలో మరియు జాతీయ రాజకీయాల్లో ని పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి .



మరింత సమాచారం తెలుసుకోండి: