ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి నడుస్తుంది.  అన్ని ముఖ్య పార్టీల అధినేతలు ప్రచార బిజీలో ఉన్నారు.   గత సార్వత్రిక ఎన్నికల సమయంలో నటుడు పవన్ కళ్యాన్ ‘జనసేన’పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. కానీ ఆయన స్వయంగా పోటీ చేయకుండా టీడీపీ, బిజెపిలకు సపోర్ట్ చేశారు.  ప్రస్తుతం పవన్ కళ్యాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకున్నారు.  ఆయన పార్టీ గుర్తు గాజు గ్లాసు. 
Image result for pawan kalyan nellore ture
ఎన్నికల ప్రచారంలో మునిగిపోయిన పవన్ కళ్యాన్ ఈ మద్య  ఆళ్లగడ్డలో మన వింగ్ కమాండర్ అభినందన్ గురించి ప్రస్థావించారు.  అయితే పవన్ కళ్యాన్ మాట్లాడిన మాటలు పాకిస్థాన్ డాన్ ప్రత్రిక ప్రచురించిన విషయం తెలిసిందే. తాజాగా  పోరాట యాత్రలో భాగంగా నెల్లూరులో పర్యటిస్తున్న పవన్ విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో పలు అంశాలపై మాట్లాడారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆళ్లగడ్డలో మాట్లాడిన మాటలు పాకిస్థాన్‌లో వినిపించాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.  అరుపులు కేకలతో మార్పు రాదని, లంచగొండితనం పోదని అన్నారు.
Image result for pawan kalyan nellore
ఆలోచనతో కూడిన నినాదంతోనే మార్పు వస్తుందని, ఆ మార్పు తానే కావాలని అనుకుంటున్నానని పవన్ అన్నారు. తాను ఆళ్లగడ్డలో మాట్లాడితే ఇస్లామాబాద్‌లో వినిపించిందన్నారు. ఎన్నికలకు ముందు విశాఖకు రైల్వే జోన్ ప్రకటించడం వల్ల బీజేపీపై అనుమానం మరింత పెరిగిందన్నారు. ప్రభుత్వ విద్యను ఓ పద్ధతి ప్రకారం చంపేశారని ఆవేదన వ్యక్తం చేసిన పవన్ తాను అధికారంలోకి వస్తే మూసేసిన స్కూళ్లు, కాలేజీలకు తిరిగి ప్రాణప్రతిష్ఠ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణపై తీవ్ర విమర్శలు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: