బయటపడిన ఐటి గ్రిడ్స్ స్కాంను సమర్ధించుకోలేక మంత్రులు నానా అవస్తలు పడుతున్నారు.  అందుకనే అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు మంత్రులు దేవినేని ఉమ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గొంతుపెంచి మరీ అరుస్తున్నారు. మంత్రుల్లో ఎవరు మాట్లాడినా  ఎదురుదాడే లక్ష్యంతో గొంతు పెంచి మరీ ఆరోపణలు చేస్తున్నారు. డేటా స్కాంలో చంద్రబాబునాయుడు, నారా లోకేష్ అడ్డంగా బుక్కయిపోయినట్లే అనిపిస్తోంది. అందుకే అందులో నుండి బయటపడేందుకు పక్కా ప్లాన్ తో చంద్రబాబు మంత్రులను తెరపైకి తెస్తున్నారు.

 

డేటా స్కాం బయటపడిన రెండు రోజుల తర్వాత కానీ మంత్రులు గొంతు విప్పని విషయం గమనార్హం. రెండు రోజులు ఎందుకు తీసుకున్నారంటే ఎదురుదాడి చేయటంపై ప్లాన్ చేసుకున్న తర్వాతే డైరెక్షన్ వచ్చిన తర్వాతే మంత్రులు మాట్లాడటం మొదలుపెట్టారు. డేటా స్కాంపై మాట్లాడితే మళ్ళీ ఎక్కడ నోళ్ళు జారుతారో అన్న భయంతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించే విధంగా రివర్సులో మాట్లాడాతున్నారు.

 

డేటా స్కాంలో చంద్రబాబు, లోకేష్ ఇరుక్కున్న విషయాన్ని పక్కనపెట్టేసి రెండు రాష్ట్రప్రభుత్వాల మధ్య సమస్యగా చిత్రీకరించేందుకు మంత్రులు కూడా ప్రయత్నిస్తున్నారు. పైగా ఏపి పోలీసులపై తెలంగాణా పోలీసులు అక్రమ కేసులు పెట్టారని మంత్రులు చెబుతుండటమే విచిత్రంగా ఉంది. మంత్రులెవరు మాట్లాడినా జగన్, మోడి, కెసియార్ అక్రమ సంబంధమని, ముగ్గురి ముసుగు తొలగిందని, ఏపిపై ముగ్గరు కలిసి కుట్రలు  చేస్తున్నారంటూ అరిగిపోయిన రికార్డులనే వినిపిస్తున్నారు.

 

చంద్రబాబు, మంత్రులు మాట్లాడుతూ టిడిపి ఓట్లను తీసేసేందుకు వైసిపినే కుట్ర చేసిందని ఎదురుదాడి చేస్తుండటమే విచిత్రంగా ఉంది. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది చంద్రబాబేనంటూ పాత పాటనే మంత్రులు మళ్ళీ వినిపిస్తున్నారు. ఎవరి కుట్రలకు భయపడేది లేదని, వైసిపి కుట్రను సమర్ధవంతంగా తిప్పి కొడతామంటూ దేవినేని రంకెలేస్తున్నారు.

 

తెలంగాణాలో 28 లక్షల ఓట్లను కెసియార్ డిలిషన్ టెక్నాలజీతో తొలగించినట్లు దేవినేని ఎద్దేవా చేశారు. ఫాం హౌస్ లో కూర్చుని జగన్ అభ్యర్ధులకు బి ఫారాలు ఇస్తున్నట్లు దేవినేని చేసిన వ్యాఖ్యలకు అర్ధముందా ? వైసిపి అభ్యర్ధులకు జగన్ బి ఫారాలు ఎక్కడ కూర్చుని ఇస్తే దేవినేనికి ఏమిటి నష్టం ? అంటే మీడియా సమావేశంలో కూడా డేటా స్కాంపై మాట్లాడే అవకాశం ఇవ్వకూడదన్నదే దేవినేని వ్యూహం. డేటా స్కాంపై ఇపుడు మాట్లాడుతున్న మంత్రులు, నేతలు ప్రత్యేకహోదా లాంటి రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడుంటే రాష్ట్రానికి ఉపయోగం జరిగేదేమో ?


మరింత సమాచారం తెలుసుకోండి: