తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తెరాసలోకి చేరుతుండటంతో కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు మొదలయ్యాయి.  మా పార్టీకి చెందినోళ్లను అప్పట్లో తీసేసుకోలేదు?  అప్పుడేమైనా అన్నామా? అన్నట్లుగా టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గయ్యిమంటున్నారు కానీ.. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్ని దివంగత మహానేత ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో నిర్వహించిన ఆపరేషన్ కు నాడు తన తండ్రి ఎంతలా ఇబ్బంది పడ్డారో.. ఎన్ని శాపనార్థాలు పెట్టారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 

Image result for ktr

గతం చాలామందికి నచ్చదు. చరిత్ర.. అదో పనికిరాని చెత్తగా అభివర్ణించేటోళ్లు తక్కువేం కాదు. కానీ.. గతమే వర్తమానానికి మూలమని.. అదే భవిష్యత్తును దిశానిర్దేశం చేస్తుందన్న సత్యాన్ని చాలామంది ఒప్పుకోరు. అయితే.. కాలం చెప్పే పాఠాలతో ముందు బోధపడని తత్త్వం తర్వాత అర్థమైనా.. అప్పటికి జరగాల్సినదంతా జరిగిపోతుంది.అధికారంలో ఉన్నప్పుడు ఎవరేం చేసినా పల్లెత్తు మాట అనరు. కానీ.. రోజులన్ని ఒక్కలా ఉండవన్న విషయాన్ని మర్చిపోకూడదు.ఎక్కడిదాకానో ఎందుకు?  చంద్రబాబు సంగతే చూడండి.

Image result for ktr

ఇరవై ఏళ్ల క్రితం ఆయనపై విమర్శలు చేయటానికి నోరు వచ్చేది కాదు. ఈ రోజున వాళ్లు.. వీళ్లు తేడా లేకుండా ఎవరైనా సరే బాబు గురించి నాన్ స్టాప్ గా విమర్శలు చేస్తుంటారు. ఈ రోజున రాజకీయాలు ఇంత దరిద్రం కావటానికి కారణం ఆయనేనని మండిపడుతుంటారు. ఒకప్పుడు తిరుగులేని నేతగా.. విజన్ ఉన్న నాయకుడిగా కీర్తిని అందుకున్న ఆయన ఇప్పుడు ఇంత దారుణమైన విమర్శల్ని ఎందుకు ఎదుర్కొంటున్నారు? అన్న ప్రశ్నకు సమాధానం చెబితే.. కాలమహిమగా చెప్పాలి. ఇలా తనదైన శైలిలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను సపోర్ట్ చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: