చంద్రబాబునాయుడుకు చెక్ పెట్టటంలో భాగంగా జగన్ పక్కా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నందమూరి కుటుంబంలో చంద్రబాబును వ్యతిరేకిస్తున్న వారందరినీ ఏకం చేయాలన్నదే జగన్ వ్యూహంగా కనబడుతోంది. అందులో భాగంగానే దగ్గుబాటి కుటుంబం, జూనియర్ ఎన్టీయార్ మామగారు నార్నే శ్రీనివాసరావును వైసిపిలో చేర్చుకున్నారు. జూనియర్ కు బాగా సన్నిహితుల్లో ఒకరైన గుడివాడ ఎంఎల్ఏ కొడాలి నాని ఎలాగూ చంద్రబాబుపై ఒంటికాలిపై లేస్తూనే ఉన్నారు. భవిష్యత్తులో కూడా చంద్రబాబును వ్యతిరేకించే వారిని ఒకే వేదికపైకి తీసుకురావటానికి జగన్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

 Image result for daggubati joins ycp

ముందుగా చంద్రబాబు తోడల్లుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావును వైసిపిలోకి చేర్చుకున్నారు. రాబోయే ఎన్నికల్లో దగ్గుబాటి కొడుకు హితేష్ చెంచురామ్ వైసిపి తరపున పరుచూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. తండ్రీ, కొడుకులు వైసిపిలో ఉన్నారు కాబట్టి ఏదో ఓ రోజు దగ్గుబాటి భార్య, బిజెపి నేత పురంధేశ్వరి కూడా వైసిపిలోకి వచ్చేయటం ఖాయంగానే ఉంది.

 Image result for narne srinivasa joins ycp

అదే సమయంలో జూనియర్ ఎన్టీయార్ మామగారైన నార్నే శ్రీనివాసరావు కూడా వైసిపిలో చేరారు. టికెట్ ఆశించి తాను పార్టీలో చేరలేదని చెబుతున్నా ప్రకాశం జిల్లాలోని అద్దంకి అసెంబ్లీ సీటుపై నార్నే దృష్టి పెట్టారని సమాచారం. వైసిపిలో గెలిచి టిడిపిలోకి ఫిరాయించిన గొట్టిపాటి రవికుమార్ పై జగన్ కూడా బాగా మండుతున్నారు. కాబట్టి గట్టి అభ్యర్ధి కోసం వెతుకుతున్నారు.

 Image result for kodali nani

ఇక గుడివాడ సంగతి కొత్తగా చెప్పుకునేదేమీ లేదు. వైసిపి ఎంఎల్ఏ కొడాలి నాని ఇప్పటికే చంద్రబాబంటే ఒంటికాలిపై లేస్తున్నారు. కొడాలి జూనియర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరని అందరికీ తెలిసిందే. పనిలో పనిగా గన్నవరం టిడిపి ఎంఎల్ఏ వల్లభనేని వంశీ కూడా టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. వంశీ కూడా జూనియర్ కు బాగా సన్నిహితుడే. అందులోను వంశీకి చంద్రబాబుపై బాగా మండుతోంది.

 Image result for vallabhaneni vamsi

నిజానికి నందమూరి కుటుంబంలో దివంగత హరికృష్ణ, బాలకృష్ణలు మాత్రమే క్రియాశీలంగా ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా డమ్మీలే. హరికృష్ణ ఎటూ లేరు. కాబట్టి మిగిలింది బాలకృష్ణ మాత్రమే. అదే సమయంలో ఎన్టీయార్ పెద్ద కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా బాగా యాక్టివే. బిజెపిలో ఉన్నఆమె కూడా వైసిపిలోకి వచ్చేస్తే చంద్రబాబు వ్యతిరేకులంతా వైసిపిలో ఉన్నట్లవుతుంది. అప్పుడు జూనియర్ ఎన్టీయార్ కూడా వైసిపికి ప్రచారం చేస్తారేమో ?


మరింత సమాచారం తెలుసుకోండి: