డేటా స్కాంలో కీలక వ్యక్తి అశోక్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది. అందరూ అనుమానించినట్లుగానే కీలక వ్యక్తిని తెలుగుదేశంపార్టీనే దాచిపెట్టింది. స్కాం వెలుగు చూడంగానే అశోక్ మాయమైపోయిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుండి కీలక వ్యక్తి కోసం తెలంగాణా పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి వెతుకుతున్నారు. అశోక్ కోసం విజయవాడ, నెల్లూరు, ఒంగోలు, బెంగుళూరులో పోలీసులు గాలిస్తున్నారు.

 

ఒకవైపు పోలీసుల గాలింపు జరుగుతుండగానే టిడిపి నాలెడ్జి సెంటర్ డైరెక్టర్ మాల్యాద్రి పెద్ద బాంబే పేల్చారు. అశోక్ తమతో రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నట్లు చెప్పారు. అశోక్ ఎక్కడికీ పారిపోలేదట. మరి పారిపోకపోతే ఎక్కడో దాక్కోవాల్సిన అవసరం ఏమిటో అర్ధం కావటం లేదు. తమతో రెగ్యుల్ టచ్ లోనే అశోక్ ను తాము తెలంగాణా పోలీసులకు అప్పగించేది లేదంటూ మాల్యాద్రి స్పష్టం చేశారు. దాంతో  అశోక్ ను టిడిపి ముఖ్య నేతలే ఎక్కడో దాచిపెట్టారన్న బలానికి మరింత ఊతం వచ్చింది.

 

పోలీసులు వెతుకుతున్న అశోక్ ఉండవల్లిలోనే సేఫ్ జోన్లో ఉన్నట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఓటుకునోటు కేసు వెలుగు చూసినపుడు కూడా కీలక వ్యక్తులను కొద్ది రోజులు టిడిపి ముఖ్యనేతలు కొద్ది రోజులు షెల్టర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో కూడా ఓటుకునోటు కేసులో కీలక వ్యక్తి అప్పటి ఎంఎల్ఏ సండ్ర వెంకట వీరయ్య కోసం పోలీసులు ఎంత వెతికినా ఆచూకీ కనిపెట్టలేపపోయారు. అలాగే ఇపుడు కూడా అశోక్ హైడ్ అవుట్ లోకి వెళ్ళిపోయాడు.  మరి ఎప్పుడు బయటకు వస్తారో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: