చంద్రబాబునాయుడుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. నెల్లూరులో జరిగిన సమర శంఖారావంలో జగన్ మాట్లాడుతూ, ఏపిని ఓ నేరగాడు పాలిస్తున్నాడన్నారు. రాక్షసుడు, నేరగాడి పాలన నుండి రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించి ప్రైవేటు సంస్ధకు అప్పగించిన దొంగ చంద్రబాబు అన్నారు. ఒకరి సమాచారాన్ని మరొకరు దొంగలిస్తే వారిని దొంగ అంటామన్నారు. కానీ ఏపి ప్రజల దురదృష్ణమేమిటంటే చంద్రబాబును సిఎం అని లోకేష్ అని ఐటి మంత్రి అని అనాల్సొస్తోందన్నారు.

 

ప్రజల వ్యక్తిగ సమాచారాన్ని బ్లూ ఫ్రాగ్ కంపెనీకి, ఐటి గ్రిడ్ కంపెనీకి ఎందుకిచ్చారంటూ జనాల తరపున నిలదీశారు. టిడిపికి సంబంధించిన డేటాను అప్ డేట్ చేస్తున్నామన్న ముసుగులో మొత్తం ప్రజల డేటాను ఎలా ఇస్తారని నిలదీశారు. అసలు  ఆ కంపెనీలు ఎవరివి ? చంద్రబాబు, లోకేష్ కు సదరు కంపెనీలతో ఉన్న సంబంధాలేంటో చెప్పాలన్నారు.

 

ప్రభుత్వమే ప్రజల డేటాను కంపెనీలకు ఇవ్వకపోతే వారికి ఎలా వచ్చాయని అడిగారు. దొంగతనం చేసిన వాళ్ళకు శిక్ష పడాల్సిందేనని జగన్ చెప్పారు. దొంగతనం చేసిన కంపెనీలపై తెలంగాణా పోలీసులు దాడులు చేస్తే చంద్రబాబు ఏపి పోలీసులను పంపటం ఏమిటంటూ జగన్ మండిపడ్డారు. పోలీసులను చంద్రబాబు సొంత వాచ్ మెన్లుగా వాడుకుంటున్నట్లు ఎద్దేవా చేశారు. సిఎం పదవిలో కూర్చోవటానికి చంద్రబాబుకు ఒక్క క్షణం కూడా వీల్లేదంటూ తేల్చేశారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: