ప్రక్రుతి చాలా అందమైంది. అందులోనే  పునరుత్పత్తి శక్తి ఉంది. శిశిరాలు వసంతాలు అదొక కాల చక్ర భ్రమణం. యుగాలు, జగాలు మారినా అది మారదు. ప్రక్రుతిని చూస్తేనే కొత్త ఉత్తేజం వస్తుంది. ఉత్సాహం వస్తుంది. ఎక్కడలేని ఆనందం కలుగుతుంది. ఆ ప్రక్రుతిలోనే భాగమై, లీనమై పులకరించి పరవశించి పోవాలనిపిస్తుంది. 


ఆ ప్రక్రుతికి ప్రతి రూపమే మహిళ. ఆమె లేకపోతే స్రుష్టి లేదు. దేవుడూ లేడు, జీవుడూ లేడు. ఎవరైనా ఆమె నుంచే రావాలి. అటువంటి మహత్తర శక్తి పడతి సొంతం. ఈ సమాజంలో సగం అంటారు, ఆకాశంలో సగం అంటారు. కానీ నిజానికి వారే సంపూర్ణం. వారిలోనే మగవారు కూడా. వారితోనే పురుషుడి జీవితమంతా అని చెప్పుకోవాలి. మన పురణాల్లో  ఆడవారిని బాల్యంలో తల్లి యవ్వనంలో భర్త, వ్రుధ్ధ్యాప్యంలో కొడుకు ఇలా అన్ని దశల్లో అండదండలుగా ఉండాలి అంటారు. కానీ నిజానికి ఆ అవసరం మహిళ కంటే పురుషుడికే ఎక్కువ.


ఉత్తమైనన మనిషిగా మగాడు రాణించాలంటే తల్లి, భార్య సహకారం చాలా అవసరం. మగవాడి జీవితాన్ని రెండు భాగాలు చేసినపుడు తొలిభాగంలో తల్లి, రెండవ భాగంలో భార్య ఉంటారు. ఆ ఇద్దరూ లేకపోతే మగవాడే లేడన్నది అక్షర సత్యం. ఇక ఆడవారిని చులకనగా చూసే వ్యవస్థ ఇపుడు కూడా సాగుతోంది.  అన్ని రంగాలో పురుషుల కంటే వారు బాగా రాణిస్తున్నా కూడా ఎక్కడో చిన్న చూపు ఉంది. ఆ భావన మగవారిలోనే కాదు. సాటి ఆడవారిలోనూ ఉంది.


తమ కొడుకులను ఓ విధంగా, కుమార్తెలను ఓ విధంగా పెంచే తల్లిదండ్రులు ఈనాటికీ ఉన్నారు. అయితే ప్రేమ, సున్నితమైన భావాలు, ఆప్యాయత, అనురాగం, భావోద్వేగాలు ఎక్కువగా ఆడవారిలోనే ఉంటాయని సైకలాజిస్టులు చెబుతారు. కొడుకుల కంటే కూడా కూతుళ్ళే ఇంటికి పేరు తెస్తారన్నది నిజం. కష్టాల్లొ నష్టాల్లో వెన్నటి నిలుస్తారని అంటారు. ఒక కుటుంబంలో ఆడది చదివి ముందుకు వెళ్తే మొత్తం కుటుంబమే వికసిస్తుంది. 


అందువల్ల వారికి తక్కువ చేయడం చాల తప్పుడు ఆలోచన. నిజానికి ఆడవారి రుణం తీర్చుకోవడం ఆ దేవుడి తరం కూడా కాదు. ఎంతో ప్రసవ వేదన అనుభవించి బిడ్డకు జన్మని ఇస్తారు. ప్రతి ప్రసవం ఓ మరణం. అ బాధను తట్టుకునే శక్తి కానీ, తొమ్మిది నెలలు బిడ్డను మోసే ఓపిక కాని ఓ మగవానికి ఉండవంటే ఉండవు. అందుకే దేవుడు ఎదురుగా వచ్చిన ముందు గౌరవించాల్సింది శ్రీ మూర్తినే అంటారు. మహిళలను ఆదరించడంలో భారతదేశమే ఓ సందేశం. దాన్ని స్పూరిగా తీసుకుని  మనమంతా ఆడవారిని గౌరవిద్దాం.  వారి నీడను, తోడును అందుకుని ఉత్తమ జీవితం పండించుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: