డేటా వ్యవహారం ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తుందని చెప్పాలి. అధికార , ప్రతి పక్ష పార్టీల మధ్య విమర్శలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. అయితే ఈ కుదుపు తెలంగాణలో అతి తక్కువగా, ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత తీవ్రంగా కన్పిస్తోంది. తెలంగాణ పోలీసులు, ఈ కేసుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 'ఎవర్నీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు' అంటూ కేసు విచారిస్తోన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి మీడియా సాక్షిగా చేసిన హెచ్చరికలు ఎవర్ని ఉద్దేశించో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

Image result for chandra babu

నిజానికి, ఇలాంటి హెచ్చరికలు గడచిన నాలుగున్నరేళ్ళలో తెలంగాణలో ఆయా కేసుల విషయంలో పలువురు పోలీస్‌ ఉన్నతాధికారులు చాలా సందర్భాల్లో చేశారు.. అదీ పరోక్షంగా ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీపై. ఆ కేసులు ఏమయ్యాయి.? అని అడక్కూడదంతే. ఇక, చంద్రబాబు తెలివిగా 'డేటా దొంగతనం' కేసులో పావులు కదుపుతున్నారు. ప్రభుత్వం తరఫున ఒక్కో విషయమ్మీదా అధికారులతో క్లారిటీ ఇప్పించేస్తున్నారు. అసలు డేటా దొంగతనానికి ఆస్కారమే లేదంటూ చంద్రబాబు, అధికారులతో చెప్పించిన వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. 

Image result for chandra babu

ఇప్పుడే ఏముంది? అసలు కథ ముందుంది! అంటున్నారు ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ నేతలు. దానర్థమేంటి.? అన్ని శాఖల అధికారులతో 'క్లియరెన్స్‌' తెప్పించేసుకుని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల్ని తెలంగాణ పోలీసులపైకి చంద్రబాబు ప్రయోగించబోతున్నారా.? అయితే, దానికి సమయం చాలా తక్కువగా వుంది. ఎందుకంటే, త్వరలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేయనుంది. అందుకే, చంద్రబాబు కూడా తొందరపడుతున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: